BigTV English

Moksh Nandamuri: ఎలా ఉండేవాడు.. ఎలా మారాడు.. అదిరిందయ్యా మోక్షజ్ఞ

Moksh Nandamuri: ఎలా ఉండేవాడు.. ఎలా మారాడు.. అదిరిందయ్యా మోక్షజ్ఞ

Moksh Nandamuri: నందమూరి వారసుడు ఎప్పుడొస్తాడు.. ?  ఎప్పుడొస్తాడు.. ? అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు ఈరోజు పండుగ దినం అని చెప్పొచ్చు. ఎట్టకేలకు నందమూరి వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.   నందమూరి నట సింహ బాలకృష్ణ ముద్దుల కొడుకు నందమూరి మోక్షజ్ఞ .. 1994 సెప్టెంబర్ 6 న జన్మించాడు. చిన్నతనం నుంచి మోక్షు..  మీడియా ముందుకు రావడం కొంచెం తక్కువే అని చెప్పాలి.


సాధారణంగా  ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి అబ్బాయిలు హీరోస్ గా రావడమే కానీ, అమ్మాయిలు ఇప్పటివరకు హీరోయిన్లుగా రాలేదు. బాలయ్య ఇద్దరు కూతుళ్ళకు హీరోయిన్లను మించిన అందం ఉంటుంది. కానీ, వారు ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. ఇక వారిద్దరి కన్నా చిన్నవాడు కావడం.. నందమూరి మాట వారసుల లిస్ట్ లో మోక్షు కూడా ఉండడంతో.. అందరి చూపు మోక్షు మీదనే ఉంది.

ఇక ఈ చిన్నోడు పెరిగేకొద్దీ..  ఎప్పడెప్పుడు   ఇండస్ట్రీలో అడుగుపెడతాడా ..? అని నందమూరి ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ వచ్చారు. అయితే మోక్షజ్ఞ.. 25 ఏళ్ళకే బాగా బరువు పెరిగి కనిపించాడు. అసలు మోక్షుకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని, అందుకే ఇండస్ట్రీలోకి రావడం లేదని కొన్నేళ్లు పుకార్లు నడిచాయి. ఇక మరి కొన్నేళ్లు కుర్రాడు .. హీరో మెటీరియల్ గా  కనిపించడం లేదని,  హీరోగా మారడానికి ఇంకా టైమ్ పడుతుందని చెప్పుకొచ్చారు.


ఇక దీంతో .. మోక్షు ఫిట్ నెస్ ను సీరియస్ గా తీసుకొని.. బరువు తగ్గి, నటనలో శిక్షణ  తీసుకొని ఎట్టకేలకు 30 వ పడిలో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం మోక్షు లుక్ చూస్తే ఎవరికైన  దిమ్మ తిరగాల్సిందే.. ఇప్పుడే 20 వ పడిలోకి అడుగుపెడుతున్నాడా.. ? అనేంతలా  మారిపోయాడు. నేడు  రిలీజ్ చేసిన పోస్టర్ లో అసలు అప్పుడు ఎలా ఉన్నాడు.. ఇప్పుడు ఎలా మారిపోయాడు అని అనుకోకుండా ఉండలేరు అంటే అతిశయోక్తి కాదు.

ఇక  హనుమాన్ లాంటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. మోక్షును హీరోగా పరిచయం చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోకు  దర్శకత్వం వహించింది ప్రశాంత్ వర్మనే.

మోక్షు డెబ్యూ డైరెక్టర్  కోసం  బాలయ్య  ఒక పెద్ద యుద్ధమే చేశాడు. ఏ డైరెక్టర్ ను రంగంలోకి దింపాలా .. ? అని తర్జనభర్జనలు పడ్డాడు. ఇక ఎట్టకేలకు  పాన్ ఇండియా  డైరెక్టర్ నే రంగంలోకి దింపాడు. త్వరలోనే  ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ నందమూరి హీరో మొదటి సినిమాతోనే ఎన్ని రికార్డులు కొల్లగొడతాడో లేదో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×