BigTV English

Telangana PCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం.. ఆయన నేపథ్యమిదే

Telangana PCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం.. ఆయన నేపథ్యమిదే

Telangana PCC Chief: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నూతన ప్రకటన చేసింది. కొత్త అధ్యక్షుడి పేరును తాజాగా వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతన వ్యక్తిని నియమించింది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ ను నియమిస్తున్నట్లు తాజాగా చేసిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియామకం కావడంతో ఆయనకు పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Also Read: తెలంగాణ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం..

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి టీపీసీసీ చీఫ్ అంశానికి సంబంధించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా మహేశ్ కుమార్ గౌడ్ పేరు ఫైనల్ అయ్యింది.. ఇక ప్రకటన రావడమే ఆలస్యమంటూ ఆ వార్తల్లో పేర్కొన్నారు. అయితే, ఈ పదివికి ఇద్దరు పలువురు నేతలు పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లగా.. అందులో ముఖ్యంగా ఇద్దరు పేర్లను పరిశీలించిందని.. ఒకరు మహేశ్ కుమార్ గౌడ్.. మరొకరు మధుయాష్కీ గౌడ్ పేర్లను పరిశీలించిందని పేర్కొన్నారు. ఈ ఇద్దరిలో నియమించాలనేదానిపైన రాష్ట్రానికి సంబంధించి పలువురు నేతలతో హైకమాండ్ సంప్రదింపులు జరిపినట్లు అందులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మహేశ్ కుమార్ గౌడ్ పేరును ఫైనల్ చేసిందని, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి బీసీలకు అవకాశం ఇయ్యాలన్న ఉద్దేశంతో మహేశ్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించందని చెబుతున్నారు ఆ వార్తల్లో వివరించారు.


పీసీసీ అధ్యక్షుడిగా జులై 7తో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయ్యింది. అప్పటి నుంచి అధ్యక్షుడి ఎంపికపై పార్టీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది.. శుక్రవారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతోపాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లు పోటీ పడినప్పటికీ అధిష్టానం ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది.

Also Read: మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

మహేశ్ కుమార్ గౌడ్ నేపథ్యం ఇదే..

మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటు పార్టీలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం రహత్ నగర్ లో మహేశ్ కుమార్ గౌడ్ జన్మించారు. గిరిరాజ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు.

ఆ తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిని చవిచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కానీ, అధిష్టానం ఆ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించడంతో మహేశ్ కుమార్ గౌడ్ పోటీ నుంచి తప్పుకున్నారు. 2018 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గానూ పని చేశారు.

Also Read: తీవ్ర విషాదం.. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవలే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగానూ పనిచేశారు. అయితే, నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ బరిలో నిలిపింది. దీంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక జనవరిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుంచి ఎవరూ నామిషన్లు వేయకపోవడంతో మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×