
Tollywood Handsome Villains : సినీ ఇండస్ట్రీలోకి ఇలా వచ్చి.. అలా పోయే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ఎలాగైనా సరే నిత్యం బరిలో ఉండాలని కొంత మంది హీరోలు మాత్రమే అనుకుంటారు. అది హీరో అయినా, విలన్ అయినా.. హీరో పాత్రలో అందంగా, గుడ్ బాయ్‌గా కనిపించిన వాళ్లే ఇప్పుడు విలన్లుగా వారిలోని మరో కోణాన్ని చూపిస్తున్నారు. మరి ఆ హాండ్సమ్ విలన్లు ఎవరో చూసేద్దామా!
నాటి అందగాడు..
మంబయి లాంటి మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మోస్ట్ హాండ్సమ్ హీరో ‘అరవింద్ స్వామి’. ఆయన హీరోగా ఎన్నో సినిమాల్లో మెప్పించారు. రామ్ చరణ్‌తో చేసిన ధృవ సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు.
విలనిజానికి తెర..
పాతికేళ్లకు పైగా సినీ ప్రయాణం.. జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు ‘జగపతిబాబు’. శుభలగ్నం, మావిచిగురు వంటి కుటుంబ కథా చిత్రాల్లో ప్రేక్షకులను అలరించాడు. అయితే, వాటికి భిన్నంగా లెజెండ్ సినిమాలో విలన్‌గా అబ్బురపరిచాడు.
అఖండమైన మలుపు..
‘రేయ్.. మర్యాద అంతఃపురం వరదరాజులిక్కడ.. ఈ ఒక్క డైలాగ్ తో ‘శ్రీకాంత్’ విలనైపోయాడు.’అఖండ’లో వొళ్లు గగుర్పొడిచే ఆయన వేషధారణ, పులిలా గర్జించే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సరైనోడు దొరికాడు..
ఒక విచిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఆది పినిశెట్టి’.. చిన్న బడ్జెట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తొలిసారి సరైనోడు సినిమాలో విలన్‌గా నటించి.. స్టైలిష్‌స్టార్ బన్నీకి సరైన విలన్ అనిపించుకున్నాడు