BigTV English

Movies on OTT: ఒక్క రోజే ఓటీటీల్లో 29 మూవీస్.. సినిమా ప్రియులకు పండగే..

Movies on OTT: ఒక్క రోజే ఓటీటీల్లో 29 మూవీస్.. సినిమా ప్రియులకు పండగే..

Movies on OTT: అసలే పండగ సీజన్.. దానికి తోడు సెలవులు. అలా బయటకు వెళ్దామా అంటే ట్రాఫిక్ ప్రాబ్లం. ఇంట్లో ఉందామా అంటే ఏం చేయాలో తెలియదు. ఇలా సతమతమయ్యే వారి కోసం ఓటీటీ ఓ తీపి కబురు తీసుకువచ్చింది. రేపు అనగా అక్టోబర్ 20వ తేదీన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 సినిమాలు ఒకే రోజు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. పండగ సెలవు లను ఇంగ్లీష్ స్వింగ్లో ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది చెప్పండి.


ఈవారం మొత్తం కలిపి ఓటీటీలో ఏకంగా 40కు పైగా సినిమాలు ,వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో రేపు ఒక్క రోజే 29 చిత్రాలు అవి కూడా రీసెంట్ గా థియేటర్లలో విడుదలైనవి స్ట్రీమింగ్ కు రావడంతో మూవీ లవర్స్ ఎక్సయిటెడ్ గా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం అదిరిపోయే చిత్రాలను ఇంటి వద్ద కూర్చుని వీలున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ చూసేయడమే. మరి ఇంతకీ రేపు రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఏమిటి? ఏ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో అవి స్ట్రీమింగ్ కాబోతున్నాయో తెలుసుకుందాం పదండి..

అమెజాన్ ప్రైమ్


సుధీర్ బాబు నటించిన మామ మశ్చీంద్ర చిత్రం అప్పుడే ఓటీటీ లోకి వచ్చేసింది. దీనితో పాటుగా ఇంగ్లీష్ మూవీస్
ట్రాన్స్ ఫార్మర్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్,సయొన్ఛ డిసర్ట్ రోజ్ ,ద అదర్ జోయ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతాయి. ఇక క్యాంపస్ బీస్ట్ సీజన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్ తో పాటు అప్ లోడ్ సీజన్ 3 అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కూడా రేపటి నుంచి స్ట్రీమింగ్ అవుతాయి.

నెట్ ఫ్లిక్స్

నెట్ ఫ్లిప్స్ లో ఈసారి స్వదేశీ కంటే కూడా అంతా విదేశీ సరికే ఎక్కువగా ఉంది. క్రియేచర్ అనే టర్కిష్ సిరీస్, డూనా అనే కొరియన్ సిరీస్ ,సర్వైవింగ్ ప్యారడై్ అనే ఇంగ్లిష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతాయి. కండాసమ్స్: ద బేబీ,ఓల్డ్ డాడ్స్,పెయిన్ హజ్లర్స్,జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిట్ అనే ఫ్రెంచ్ సినిమా రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

ఆహా

సుధీర్ బాబు మామా మశ్చీంద్ర మూవీ అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక దీనితో పాటుగా సర్వశక్తిమయం అనే తెలుగు మూవీ, రెడ్ శాండిల్ వుడ్ అనే తమిళ్ మూవీ కూడా ఆహా లో రేపటి నుంచి చూడవచ్చు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కింగ్ ఆఫ్ కొత్త న్యూ హిందీ మూవీ రేపటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఇవే కాక రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని సినిమాలు ,వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం మొత్తం సినిమా ప్రియులకు పండగే పండగ.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×