E-Paper
Advertisement

Movies : ఈవారం థియేటర్లు , ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..

Movies : ఈవారం థియేటర్లు , ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..
Advertisement

Movies : టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత వేసవి సీజన్ లో ఎక్కువ సినిమాలు విడుదలవుతాయి. సెలవుల సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. ఈ ఏడాదికి సమ్మర్ సందడి షురూ అయ్యింది. కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ వారంలో ప్రేక్షుకులను అలరించడానికి కొన్ని మూవీలు సిద్ధమయ్యాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీ వేదికల్లో అందుబాటులోకి రానున్నాయి.

శ్రీరామ నవమికి దసరా సందడి..
నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా రిలీజ్ కు రెడీ అయ్యింది . ఈ సినిమా శ్రీరామనవమి కానుకగా మార్చి 30న విడుదలకానుంది. ఇప్పటికే విడుదలై దసరా ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Advertisement

విభిన్న కథ.. దహనం..
ఆదిత్య ఓం కథానాయకుడిగా ఆడారి మూర్తిసాయి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దహనం. నీరు, నిప్పు, గాలితోపాటు.. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలతో ముడిపడిన కథతో ఈ మూవీని రూపొందించారు. కొన్ని తరాలు పూజలందుకుని మూతపడిన శివాలయంలో మళ్లీ పూజలు మొదలుపెట్టే భైరాగి పాత్రను ఆదిత్య ఓం షోషించాడు. 3పాత్రల చుట్టూ సాగే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీపెతకంశెట్టి సతీష్‌ కుమార్‌ నిర్మించిన దహనం మూవీ మార్చి 31న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. వీటితోపాటు పరారీ, వీరఖడ్గం, ఏజెంట్ నరసింహా-117, సత్యం వధ .. ధర్మం చెర సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..
దసరా ( మార్చి 30)
పరారీ (మార్చి 30)
దహనం ( మార్చి 31)
వీరఖడ్గం (మార్చి 31)
ఏజెంట్‌ నరసింహా-117 (మార్చి 31)
సత్యంవధ.. ధర్మం చెర (మార్చి 31)

Advertisement

ఓటీటీలో సందడి చేసే మూవీస్,వెబ్‌సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌..
క్రైసిస్‌ (హాలీవుడ్‌) -మార్చి 26
అన్‌సీన్‌ (హాలీవుడ్‌)- మార్చి 29
ఎమర్జెన్సీ ఎన్‌వైసీ (వెబ్‌సిరీస్‌)- మార్చి 29
ఆల్మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌ (హిందీ)- మార్చి 31
కిల్‌ బాక్సూన్‌ (కొరియన్‌) -మార్చి 31
మర్డర్‌ మిస్టరీ-2 (హాలీవుడ్‌) -మార్చి 31
అమిగోస్‌ (తెలుగు) -ఏప్రిల్‌ 1
షెహజాదా (హిందీ)- ఏప్రిల్‌ 1

అమెజాన్‌ ప్రైమ్‌ ..
ది పవర్‌ (వెబ్‌సిరీస్‌) -మార్చి 31

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌..
సక్సెషన్‌ (వెబ్‌సిరీస్‌-4)- మార్చి 26
శ్రీదేవి శోభన్‌బాబు (తెలుగు) -మార్చి 30
డూగీ కామియలోహ ఎండీ (హిందీ)- మార్చి 31
గ్యాస్‌లైట్‌ (హిందీ)- మార్చి 31
సెల్ఫీ (హిందీ) -మార్చి 31

జీ5..
అగిలన్‌ (తమిళ) -మార్చి 31
అయోధ్య (తమిళ)- మార్చి 31
యునైటెడ్‌ కచ్చే (హిందీ)- మార్చి 31

ఆహా..
సత్తిగాని రెండెకరాలు (తెలుగు) -ఏప్రిల్‌ 1

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×