BigTV English

EPF : ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు.. ఈ ఏడాది ఎంతంటే..?

EPF : ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు.. ఈ ఏడాది ఎంతంటే..?

EPF: ఉద్యోగుల భవిష్య నిధి.. EPF ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. తాజా జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించారు. EPFపై వడ్డీరేటు ప్రతిపాదనను కేంద్ర ఆర్థికశాఖకు పంపిస్తారు. కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటును అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని 5 కోట్ల చందాదారుల ఖాతాల్లో ఈపీఎఫ్‌ఓ జమ చేస్తుంది.


గత నాలుగేళ్లుగా EPFపై వడ్డీ రేటు తగ్గుతూ వచ్చింది. 2018-19 వడ్డీ రేటు 8.65 శాతం ఉంది. ఆ తర్వాత ఏడాది నుంచి క్రమంగా తగ్గింది. 2019-20, 2020-21 వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. 2021-22 మాత్రం EPFపై వడ్డీరేటు భారీగా తగ్గింది. ఆ ఏడాది వడ్డేరేటును 8.10 శాతానికి తగ్గించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు. కానీ ఈ ఏడాది కూడా కేవలం 0.05 శాతం మాత్రమే వడ్డీరేటు పెంచుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. గత పదేళ్లలో 2015-16లో గరిష్టంగా 8.80 శాతం వడ్డీరేటు ఉంది.

గత పదేళ్లలో ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు..
2011-12 : 8.25 శాతం
2012-13 : 8.5 శాతం
2013-14 : 8.75 శాతం
2014-15 : 8.75 శాతం
2015-16 : 8.80 శాతం
2016-17 : 8.65 శాతం
2017-18 : 8.55 శాతం
2018-19 : 8.65 శాతం
2019-20 : 8.5 శాతం
2020-21 : 8.5 శాతం
2021-22 : 8.1 శాతం


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×