BigTV English

TDP : టీడీపీ మహిళా నేత అరెస్ట్.. చంద్రబాబు ఫైర్..

TDP : టీడీపీ మహిళా నేత అరెస్ట్.. చంద్రబాబు ఫైర్..

TDP : ఏపీలో ఓ మహిళా టీడీపీ నేత అరెస్ట్ పొలిటికల్ హీట్ ను పెచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనపై రెండు కేసులు నమాదయ్యాయి. ఈ కేసులో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణిని పోలీసులు నిందితురాలిగా పేర్కొన్నారు. అప్పట్నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా హనుమాన్‌ జంక్షన్‌లోని నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తెల్లవారుజామున కల్యాణి ఇంటికి వచ్చి అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో పోలీసులు, కల్యాణి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


ఇంత దుర్మార్గమా..?: చంద్రబాబు
మూల్పూరి సాయి కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. కల్యాణిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఓ మహిళను బెడ్‌రూంలోకి చొరబడి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలు ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.

వ్యవస్థకే కళంకం: లోకేశ్
సాయి కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఓ మహిళపై ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ నేతల మెప్పు కోసం పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. కల్యాణికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×