BigTV English

Movies : ఈవారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే..! ఆ మూవీస్ ఓటీటీల్లో సందడి..

Movies : ఈవారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే..! ఆ మూవీస్ ఓటీటీల్లో సందడి..

Movies : ఈ మధ్యకాలంలో థియేటర్లలో బిగ్ మూవీస్ సందడి చేయలేదు. గత 3 వారాలుగా చిన్న సినిమాలు హవానే నడిచింది. చాలా రోజుల తర్వాత స్టార్ హీరోల సినిమా విడుదల కాబోతోంది. జులై చివరి వారంలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రోగా థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.


బ్రో మూవీని సముద్రఖని తెరకెక్కించాడు. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సిత్తం సినిమాను తెలుగులో బ్రోగా రీమేక్‌ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రో మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి తమన్‌ మ్యూజిక్ అందించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, సముద్రఖని, రోహిణి బ్రోలో కీలక పాత్రలు పోషించారు.

నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు కథానాయకుడిగా నటించిన ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో ప్రణవి మానుకొండ హీరోయిన్. బ్రహ్మాజీ, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏఆర్‌ శ్రీధర్‌ తెరకెక్కించారు. ఈ నెల 29న స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


బాలీవుడ్‌ స్టార్ హీరో రణవీర్‌ సింగ్‌, అలియా భట్‌ జోడిగా నటించిన చిత్రం ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ. కరణ్‌ జోహార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మూవీస్/వెబ్‌సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌..
డ్రీమ్‌ (కొరియన్‌ మూవీ)- జులై 25
మామన్నన్‌ (తమిళ్‌/తెలుగు)- జులై 27
పారడైజ్‌ (హాలీవుడ్)- జులై 27
హిడెన్‌ స్ట్రైక్‌ (హాలీవుడ్) -జులై 27
హ్యాపీనెస్‌ ఫర్‌ బిగినెర్స్‌ (హాలీవుడ్‌)- జులై 27
హౌ టు బికమ్‌ ఎ కల్ట్‌ లీడర్‌- జులై 28

సోనీలివ్‌..
ట్విస్టెడ్‌ మెటల్‌ (వెబ్‌సిరీస్‌)- జులై 28

డిస్నీ+ హాట్ స్టార్..
ఆషిఖానా (హిందీ సిరీస్‌)- జులై 24

బుక్‌ మై షో..
జస్టిస్‌ లీగ్‌ : వార్‌ వరల్డ్‌ (యానిమేషన్‌ మూవీ)- జులై 23
ట్రాన్స్‌ఫార్మర్స్‌: రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌)- జులై 26
ద ఫ్లాష్‌ (హాలీవుడ్‌)- జులై 27

జియో సినిమా..
లయనెస్‌ (హాలీవుడ్‌) -జులై 23
కాల్‌కూట్‌ (హిందీ)- జులై 27

మనోరమా మ్యాక్స్‌..
కొళ్ల (మలయాళం) -జులై 27

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×