E-Paper
Advertisement

Mrunal Thakur: ప్రభాస్ తో మృణాల్.. ఏంటి మావా అంత మాట అనేసింది

Mrunal Thakur: ప్రభాస్ తో మృణాల్.. ఏంటి మావా అంత మాట అనేసింది
Advertisement

Mrunal Thakur: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది కల్కి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ .. ప్రస్తుతం రాజాసాబ్ షూట్ తో బిజీగా మారాడు. ఇక ఈ సినిమా తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీని కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే హను.. సీతారామం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. దీని తరువాత ప్రభాస్ తో సినిమా అనగానే అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లిందని టాక్ నడుస్తోంది. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం జరిగిన సమయంలో తెరకెక్కిన సినిమా అని చెప్పుకొస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి.

Advertisement

ఇక గత కొన్నిరోజులుగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. హను దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతోనే మృణాల్ తెలుగు తెరకు పరిచయమైంది. దీంతో హను.. తన తదుపరి సినిమాకు కూడా మృణాల్ నే తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ప్రభాస్ – మృణాల్ ఫోటోలను పక్కపక్కన పెట్టి .. సూపర్ జంట అని మీమ్స్ కూడా వేసేశారు.

తాజాగా ఈ వార్తలపై మృణాల్ స్పందించింది. అభిమానుల ఆశలపై మృణాల్ నీళ్లు చల్లింది. త్వరలోనే ఫౌజీ సెట్ లో మృణాల్ జాయిన్ అవుతుంది అన్న ఒక పోస్ట్ కు ఆమె కామెంట్ పెడుతూ.. ” మీ వీబీ ను పాడుచేస్తున్నందుకు క్షమించండి. నేను ప్రభాస్ సినిమాలో లేను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వార్త వినగానే డార్లింగ్ ఫ్యాన్స్ గుండెలు ముక్కలు అయిపోయాయి. ఏంటి మావా అంత మాట అనేసింది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి మృణాల్ కాకపోతే.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ పట్టేసిన ఆ ముద్దుగుమ్మ ఎవరు.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×