E-Paper
Advertisement

Saina Nehwal: భారత బ్యాడ్మింటన్‌ని ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు

Saina Nehwal: భారత బ్యాడ్మింటన్‌ని ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Advertisement

Netizens Trolling Indian Badminton Player Saina Nehwal: భారతీయులకు జావెలిన్ త్రో గురించి 10 ఏళ్ల కిందటి వరకు తెలియదా, అసలు అలాంటి క్రీడ అథ్లెటిక్స్‌లో ఉందని తెలియదా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఏమనాలి.అందులోనూ ఓ ప్రసిద్ధ ప్లేయర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏమనుకోవాలి. అసలే సోషల్ మీడియా కాలం. ట్రోలింగ్ కు ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూసే నెటిజన్లు ఉన్న లోకం.సరిగ్గా ఇలానే అడ్డంగా దొరికిపోయింది ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. దీంతో ఆమెను మాస్ ర్యాగింగ్ చేశారు నెటిజన్లు. ఇంతకూ అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కు దూరమైన సెనా, ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

అయితే ఇటీవల ఒలింపిక్స్ లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోయిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అంశమై ఓ పాడ్ కాస్ట్‌లో సైనా మాట్లాడింది. ఆ సంభాషణ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్‌ లో నీరజ్‌చోప్రా జావెలిన్‌త్రోలో బంగారు పతకం సాధించిన అంశం ప్రస్తావన తెచ్చింది. వాస్తవానికి ఆ పాడ్ కాస్ట్‌లో సైనా చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది. కానీ ఒక్కచోట తప్పటడుగు వేసింది. ఆ తర్వాతనే అథ్లెటిక్స్‌ లో ఇలాంటి ఒక ఈవెంట్‌ ఉందని తెలిసిందంటూ సైనా మాట్లాడాంది. వాస్తవానికి భారతీయులకు జావెలిన్ త్రో గురించి తెలుసు. మనకు అందులో ఒలింపిక్ పతకాలు వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఆ ఆటపై అవగాహన ఉంది. ప్రపంచ చాంపియన్లు ఎవరనేది కూడా కొందరు అభిమానులు క్షణాల్లో చెప్పగలరు. కానీ సైనా నెహ్వాల్ మాత్రం జావెలిన్ త్రో మనకు అసలు తెలియదనే ఉద్దేశంలో మాట్లాడటంతో దుమారం రేపింది. దీంతో ట్రోలర్లకు చిక్కిపోయింది. కొందరు ఆశ్చర్యపోగా, మరికొందరు ఇదే అదనుగా చెలరేగిపోయారు. కంగనా రనౌత్ ఆఫ్‌ స్పోర్ట్స్‌ అంటూ ఒకరు తీవ్రమైన పదజాలంతో కామెంట్ చేయగా, సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్‌ కు దిగడాన్ని సైనా సవాల్ విసిరింది. కామెంట్లు చాలా సులువని ఆడడమే చాలా కష్టమని పేర్కొన్నది.

Advertisement

Also Read: ఇకపై రెస్ట్ తీసుకోనున్న భారత ప్లేయర్, ఎందుకంటే…!

కంగనాతో పోల్చినందుకు థ్యాంక్స్ తెలపింది. కంగనా రనౌత్ చాలా అందమైన వ్యక్తి. తాను మాత్రం బ్యాడ్మింటన్ లో స్టారని, చెప్పుకొచ్చింది. మీలాంటివారు నాపై ఇంట్లో కూర్చుని కామెంట్లు చేయడం ఈజీనే.. కానీ నాలా ఆడడం మీకు కష్టమని కౌంటర్ ఇచ్చింది సైనా. పనిలో పనిగా.. నీరజ్‌ చోప్రా భారత సూపర్ స్టార్ అని.. జావెలిన్‌ త్రో ప్రాచుర్యం రావడంలో కీలక పాత్ర పోషించాడని తనను తాను సమర్థించుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. అంతేగాక భారత్ కు ఒలింపిక్ పతకం తెచ్చానని తెలిపింది. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైనాకు కాంస్యం దక్కింది. ఆ తర్వాత 2016 ఏడాదిలో రాణించలేకపోయింది. క్రమంగా బ్యాడ్మింటన్ కు గుడ్‌బై చెప్పింది. స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో మనస్పర్థలు రావడం, అంతేకాకుండా తనకు గాయాలు కావడంతో సైనా కెరీర్ ను దెబ్బతీశాయనే చెప్పాలి. సొంత రాష్ట్రం హరియాణా అయినా కూడా హైదరాబాద్ అమ్మాయిగానే సైనా పేరు సంపాదించుకుంది. అయితే ఒలింపిక్ పతకం తర్వాత మళ్లీ ఆమె అంతగా ఆటలో రాణించలేకపోయింది. ఈలోగా అచ్చ తెలుగు అమ్మాయి పీవీ సింధు తెరమీదకు దూసుకొచ్చింది. సైనా పూర్తిగా మాసిపోయింది. కొంచెం దూకుడు తత్వం ఉన్న ఆమె తరచూ విమర్శకులకు పాలు కావడంతో అందరూ ఆమెకు పొగరు ఎక్కువ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×