BigTV English

Mrunal Thakur: విరాట్ కోహ్లీ ప్రేమలో మృణాల్.. అనుష్క పరిస్థితి ఏంటి.. ?

Mrunal Thakur: విరాట్ కోహ్లీ ప్రేమలో మృణాల్.. అనుష్క పరిస్థితి ఏంటి.. ?

Mrunal Thakur: బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాల్ కు నిరాశనే దక్కింది. హాయ్ నాన్న లాంటి హిట్ తరువాత ఆమెకు మొదటి ప్లాప్ ఫ్యామిలీ స్టార్ ద్వారా పడింది. ఇక అవేమి పట్టించుకోని మృణాల్.. వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.


ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇకపోతే ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ అన్నాక రూమర్స్ రావడం సాధారణమే. ఒక హీరో నచ్చాడు అని చెప్పడం ఆలస్యం వారి ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. తాజాగా మృణాల్.. విరాట్ కోహ్లీ ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

క్రికెటర్ విరాట్ పై మృణాల్ మనసు పారేసుకుందని, ఇప్పుడు అనుష్క పరిస్థితి ఏంటి అని అర్ధం వచ్చే విధంగా ఒక బాలీవుడ్ మీడియా మృణాల్ పై రూమర్స్ క్రియేట్ చేసింది. దానికి సాక్ష్యంగా గతంలో మృణాల్.. విరాట్ గురించి, సచిన్ గురించి మాట్లాడిన మాటలను చూపించింది.


గతంలో మృణాల్ మాట్లాడుతూ.. ” క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ప్రేమలో ఉన్నాను. ఇక సచిన్ టెండూల్కర్ అంటే కూడా ఇష్టం. నా సోదరుడు వలన నాకు క్రికెట్ అలవాటు అయ్యింది. ఐదేళ్ల క్రితం అతనితో మ్యాచ్ చూసిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. స్టేడియంలో ఇండియా జెర్సీ వేసుకొని వారిని ఉత్సాహ పర్చడం ఆనందంగా ఉంది. అలాంటి నేను.. ఇప్పుడు జెర్సీ సినిమాలో నటించడం మరింత ఆనందాన్ని అందిస్తుంది” అని చెప్పుకొచ్చింది.

ఇక ఆ మాటలను ఇప్పుడు ఒక బాలీవుడ్ మీడియా మరోసారి హైలైట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇక ఈ పుకార్లపై మృణాల్ స్పందించింది. ఇలాంటివి ప్రచురించడం ఆపాలని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×