Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ (Mrunhal Thakur).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు హిందీ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న మృణాల్ తెలుగులో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా, హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాలో నటించినది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్. అచ్చ తెలుగు అమ్మాయిలా ఇందులో చాలా చక్కగా సీత పాత్రలో నటించి ఆకట్టుకుంది. తర్వాత నాని(Nani)తో ‘హాయ్ నాన్న’ సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా చేసింది కానీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె మరో తెలుగు సినిమాకు ఒప్పుకోలేదు. కానీ అడివి శేషు (Adivi shesh) హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ మూవీలో మాత్రం భాగమైంది. ఇందులో మొదట శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా ఎంపికైంది. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ మేకర్స్ తో ఇబ్బందులు ఏర్పడడంతో ఆమె తప్పుకుంది .ఇప్పుడు అక్కడ రూ.2.50కోట్ల రెమ్యునరేషన్తో రంగంలోకి దిగింది.
లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న మృణాల్..
ఇక ఈ సినిమా తర్వాత ఈమె చేతిలో మరో సినిమా ఉందా అంటే లేదా అనే సస్పెన్స్ మొదలైన టైంలో ఈమెపై ఒక కొత్త రూమర్ మొదలైంది. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా అనిల్ రావిపూడి ప్రకటించారు కూడా.. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా మృణాల్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె మాత్రం ఈ కాంబినేషన్ కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది .అందుకే ఆమెను మేకర్స్ వద్దనుకున్నట్లు వార్తలు రాగా.. మరొకవైపు ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ లో పెద్దగా ఫామ్ లో లేనప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాను వదులుకోవడం చాలా తెలివి తక్కువ తనం అని మరి కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. ఇంకొంతమంది డబ్బు ఆశకుపోయి బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయింది. ఇక భవిష్యత్తులో ఈమెకు తెలుగులో అవకాశాలు వస్తాయా..? అనే కోణంలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈమె గురించి వస్తున్న ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మృణాల్ కెరియర్..
2012లో ‘ముజ్సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్’అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టిన ఈమె 2014లో వచ్చిన ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక తర్వాత హిందీ, తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఇతర భాషలలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.