Mehreen Pirzada: ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మెహ్రీన్ (Mehreen Pirzada).. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె తన అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. ఇకపోతే ‘ఎఫ్2 ‘ సినిమా చేసిన తర్వాత కెరియర్ స్టార్టింగ్ లోనే ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకొని, అందరిని ఆశ్చర్యపరిచిన ఈమె.. వెంటనే మళ్ళీ అతడికి బ్రేకప్ చెప్పేసి సినిమా జీవితంపై ఫోకస్ పెట్టింది. అలా మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చిందో లేదో అప్పుడే మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని రూమర్లు తెగ వినిపించాయి. అయితే ఈ వార్తలు దావనంలా పాకుతున్న వేళ ఈ జంట నిజం కాదని కొట్టిపారేసింది. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంటాయి.
రెడ్ హార్ట్.. రెడ్ లిప్స్.. హింట్ ఇచ్చేస్తున్న మెహ్రీన్..
ఇకపోతే ఎవరు ఎన్ని రకాల రూమర్లు గుప్పించినా తనకేమీ పట్టనట్టు ఉంటున్న ఈమె.. ఈ మధ్య సోషల్ మీడియాలో మళ్లీ రకరకాల ఫోటోలతో అటు నెటిజన్స్ లోనే కాదు ఇటు అభిమానులలో కూడా కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. మొన్నటికి మొన్న పెయింటింగ్ వేస్తూ.. ఈ ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతోంది అంటూ ఒక వ్యక్తి ఫోటోని కూడా షేర్ చేసిన ఈమె.. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా మరో పోస్ట్ పెట్టి అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక లిప్స్టిక్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు హార్ట్ సింబల్ ను చేతిలో పట్టుకొని.. “రెడ్ హార్ట్.. రెడ్ లిప్స్.. అన్ని పర్ఫెక్ట్ గా ఉంచడానికి చూస్తుంది”.. అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ప్రేమలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేస్తున్నావా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. “నీ ఎర్రటి పెదవులు చూస్తుంటే ఆ మధురమైన క్షణాల కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉంది?.” అంటూ మరొక నెటిజన్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమకు తోచిన విధంగా అభిప్రాయాలు పంచుకుంటూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కెరియర్ పీక్స్ లో ఉండగానే నిశ్చితార్థం, బ్రేకప్..
మెహ్రీన్ విషయానికి వస్తే.. 1995 నవంబర్ 5న పంజాబ్, భటిండాలో జన్మించింది. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే మార్చి 2021 హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు ప్రస్తుతం అలంపూర్ ఎమ్మెల్యే భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది. 2021లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కోవిడ్ 19 మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇక జూలై 2021 లోని వ్యక్తిగత కారణాలవల్ల వీరిద్దరి నిశ్చితార్థం ఆగిపోయింది.ఇక అప్పటినుండి ఒంటరిగా ఉంటున్న ఈమె ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
Also Read:Maas Jathara: 80 శాతం షూటింగ్ పూర్తి.. ఇప్పుడు ఎక్కడ జరుగుతోందో తెలుసా..?