Game Changer Movie: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా గేమ్ చేంజర్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అంజలి, ఎస్ జె సూర్య, సునీల్ జయరాం, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. వెండితెరపై రిలీజ్ అయ్యిన గేమ్ చేంజర్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనుంది. ఈ సినిమా ఏ రోజు ఎన్ని గంటలకు ఏ టీవీలో ప్రసారం కానుందో తెలుసుకుందాం..
సినిమా కథ..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిని స్వచ్ఛందమైన ఎన్నికల నిర్వహణ అధికారిగా రామ్ చరణ్ పాత్ర. ఈ మూవీలో రామ్ చరణ్ నటన ఆకట్టుకుంటుంది. వెండితెరపై అలరించిన ఈ సినిమా ఏప్రిల్ 27 సాయంత్రం 5:30 నిమిషాలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో గా ఈ సినిమాను జీ టెలివిజన్ తెలుగు లో ఏప్రిల్ 27న సాయంత్రం ప్రసారం కానుంది. వెండి తెరపై మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేయనుందో అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా టీవీ ప్రీమియర్ షో లో వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. గేమ్ చేంజర్ ఆ కోవలోకి రావాలని చెర్రీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అప్పుడే టీవిలో ..
ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించారు. ఐఏఎస్ పాత్ర కన్నా రైతు పాత్రలో రామ్ చరణ్ నటన అందరిని ఆకట్టుకుంది. ఎస్ జె సూర్య బొబ్బిలి మోపిదేవి నెగిటివ్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చారు. అన్ని పాటలు చాల బాగా యూత్ కి కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7 వ తేది నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ డబ్బింగ్ మార్చి 7వ తేదీ నుండి జి 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. రామ్ చరణ్ ఫాన్స్ కు శంకర్ గ్రాండ్ సినిమాటిక్ స్టైల్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక వినోదాత్మకమైన రాజకీయ డ్రామాగా నిలిచింది. రామ్ చరణ్ నటన, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. కథలో సాంప్రదాయకత, కొన్ని సాంకేతిక లోపాలు కొంతమంది నిరాశపరిచినప్పటికీ రాజకీయ థ్రిల్లర్ గా మాస్ ఎంటర్టైనర్ గా సినిమా సక్సెస్ ని అందుకుంది. జీ తెలుగులో ఈ సినిమా రానుండడంతో అభిమానులు ఏప్రిల్ 27 కోసం ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Priyadarshi: నాకు చిన్న సినిమాలు వద్దు.. ఇన్ హీరో షాకింగ్ స్టేట్మెంట్..