Mufasa The Lion King Collections: గత కొన్నేళ్లలో యానిమేషన్ సినిమాలకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. కమర్షియల్ సినిమాలకు ధీటుగా అవి కూడా కలెక్షన్స్ సాధించడం మొదలుపెట్టాయి. అందుకే కేవలం బుల్లితెరపై ఉన్న యానిమేషన్‌ను వెండితెరపైకి తీసుకొచ్చారు మేకర్స్. భారీ బడ్జెట్‌తో, అత్యధిక ప్రొడక్షన్ వాల్యూతో తెరకెక్కే యానిమేషన్ మూవీస్ చాలావరకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక మరో యానిమేషన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘ముఫాసా ది లయన్ కింగ్’. నాలుగేళ్ల క్రితం విడుదలయిన ‘ది లయన్ కింగ్’ అనే సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘ముఫాసా’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను బాగానే మెప్పించింది.
సూపర్ సక్సెస్
‘ది లయన్ కింగ్’ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగానే మెప్పించగలిగింది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఈ సినిమాను ప్రశంసించారు. అందుకే అప్పుడే ఈ సినిమాకు ఒక ప్రీక్వెల్ కూడా రాబోతుందని, దాని పేరు ముఫాసా అని మేకర్స్ ప్రకటించారు. కానీ ‘ముఫాసా ది లయన్ కింగ్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి నాలుగేళ్లు పట్టింది. పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో, అదిరిపోయే విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకుంది ముఫాసా. కేవలం ఇంగ్లీష్‌లోనే కాదు.. ఇండియన్ భాషల్లో కూడా ‘ముఫాసా ది లయన్ కింగ్’కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. కేవలం ఇండియాలోనే మొదటిరోజు రూ.10 కోట్ల కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా.
Also Read: ముఫాసా: ది లయన్ కింగ్ మూవీ రివ్యూ
ఇండియాలో మాత్రమే
ఇండియాలో చాలావరకు ప్రేక్షకులు ‘ముఫాసా ది లయన్ కింగ్’ను మొదటి రోజే చూడడానికి క్యూ కట్టారు. అందుకే కేవలం ఇండియాలోనే ఈ సినిమాకు రూ.10 కోట్లు ఓపెనింగ్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంగ్లీష్‌లో రూ.4 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, తెలుగులో రూ.2 కోట్లు, తమిళంలో రూ.1 కోటి కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. ఇదంతా ఇండియాలోనే కావడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘ముఫాసా ది లయన్ కింగ్’ మొదటి రోజు కలెక్షన్స్ గురించి ఇంకా లెక్కలు తేలలేదు. అయినా కూడా ఒక వారంలోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 180 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ కొల్లగొడుతుందని హాలీవుడ్ మీడియా అంచనా వేస్తోంది. ఈ మూవీకి వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే వారి అంచనా నిజమయ్యేలా ఉందని అనిపిస్తోంది.
భారీ బడ్జెట్
‘ముఫాసా ది లయన్ కింగ్’ను 200 మిలియన్ డాలర్లు అంటే రూ.1264 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు మేకర్స్. హాలీవుడ్ సినిమాలకు ఈ రేంజ్‌లో బడ్జెట్ పెట్టడం చాలా కామన్. అలాగే ఆ సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ అందుకొని కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుంటాయి. ‘ముఫాసా ది లయన్ కింగ్’ కూడా అలాగే దూసుకుపోతుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ మూవీ చాలామంది ప్రేక్షకులను మెప్పించింది. ఈవారం విడుదలయిన అన్ని సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు కూడా ‘ముఫాసా’కే పడుతుంది. అందుకే కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో యానిమేషన్ సినిమాల రికార్డులు బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.