BigTV English

AP Liquor Rates: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు!

AP Liquor Rates: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు!

Liquor Rates: ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు న్యూ ఇయర్ కానుక ప్రకటించింది. భారీగా మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయడంపై మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే న్యూ ఇయర్ రానుంది. 2025 సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.


డిసెంబర్ 31వ తేదీన మద్యం కొనుగోళ్ల జోరు అధికంగా సాగడం షరా మాములే. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే నూతన మధ్య విధానం ద్వారా బ్రాండెడ్ మద్యం ను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం, ఇచ్చిన హామీ మేరకు 99 రూపాయలకే మద్యం బాటిళ్లను సైతం అందిస్తోంది.

ఏపీలో ఎన్నికలకు సమయం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మద్యం ప్రియుల కోసం నూతన మద్యం విధానంను సైతం ప్రవేశపెట్టారు. అయితే అక్కడక్కడ మద్యం షాపు యజమానులు లాభార్జన లేకపోవడంతో కొంత నిరాశను సైతం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మార్పీ రేట్లకు మించి మద్యం విక్రయాలు సాగిస్తే జరిమానాలు తప్పవంటూ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో ఖంగు తిన్న మద్యం షాప్ యజమానులు, తమకు హామీ ఇచ్చిన కమిషన్ ఇవ్వాలంటూ అక్కడక్కడ ఎక్సైజ్ శాఖ కమిషనర్లకు వినతి పత్రాలను సైతం అందజేశారు.


ఈ దశలోనే న్యూ ఇయర్ రానుండగా, డిసెంబర్ 31వ తేదీన మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయన్న నమ్మకంతో మద్యం వ్యాపారులు సైతం ఉన్నారు. అటువంటి తరుణంలో పలు బ్రాండెడ్ మద్యం రేట్లను తగ్గిస్తూ ప్రకటన వెలువడడంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 11 మద్యం కంపెనీలు బేస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ధరలు తగ్గింపుకు మార్గం సుగమమైంది.

Also Read: Game Changer: రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. ఇండియాలోనే అతిపెద్ద కటౌట్ లాంఛ్..

దీనితో ఒక్క క్వార్టర్ పై 30 రూపాయలు, ఫుల్ బాటిల్ పై రూ. 90 నుండి రూ. 120 వరకు ధరలు తగ్గనున్నాయి. మ్యాన్షన్ హౌస్, రాయల్ ఛాలెంజ్, యాంటీక్విటీ సహా పలు బ్రాండ్లు మద్యం ధరలు తగ్గించిన జాబితాలో ఉండడం విశేషం. అసలే సంక్రాంతి, న్యూ ఇయర్ రానున్న నేపథ్యంలో మద్యం ధరలు తగ్గడంపై మద్యం ప్రియులకు ఈ వార్త మంచి కిక్కిస్తుందని చెప్పవచ్చు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×