IND vs PAK: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో చాలా రోజులుగా నెలకొన్న గందరగోళానికి ఐసీసీ తెరదించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతుందని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్ కోరినట్లుగానే హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నీ జరుగుతుంది. 2024 – 27 మధ్య కాలంలో టీమిండియా – పాకిస్తాన్ మధ్య జరగనున్న ఐసీసీ ఈవెంట్లు మొత్తం హైబ్రిడ్ మోడల్ లోన్ నిర్వహించబడతాయని ఐసీసీ తెలిపింది.
Also Read: Mohammed Siraj: సిరాజ్ అరుదైన రికార్డు.. పవర్ ప్లే లో అసలు సిసలు మొనగాడు!
భద్రతా కారణాల దృశ్యా వచ్చే ఏడాది జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు పాకిస్తాన్ కి వెళ్ళదు. ఈ టోర్నీలో తటస్థ వేదికలో మ్యాచ్ లు ఆడుతుంది. అయితే కొలంబో లేదా దుబాయ్ ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇదిలా ఉంటే.. ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఫిబ్రవరి 23న కొలంబో లేదా దుబాయ్ లో తలపడబోతోంది. 8 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాకిస్తాన్ తో భారత జట్టు పోటీ పడనుంది.
చివరగా 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా – పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఓవల్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య టైటిల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును సర్పరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు 180 పరుగుల భారీ తేడాతో టీమ్ ఇండియాని ఓడించి టైటిల్ ని సొంతం చేసుకుంది. ఇక ఎనిమిది సంవత్సరాల తరువాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి పాకిస్తాన్ తో తలపడబోతోంది భారత జట్టు.
అయితే ఈ టోర్నీ షెడ్యూల్ ని ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. షెడ్యూల్ ని త్వరలోనే ఐసీసీ ప్రకటించబోతుందని సమాచారం. కేవలం భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లు మాత్రమే తటస్థ వేదికలపై జరుగుతాయి. ఇక ఇతర జట్లు టోర్నమెంట్ మొత్తాన్ని పాకిస్తాన్ లోనే ఆడతాయి. ఈ టోర్నీలో ఒకవేళ టీమిండియా సెమీ ఫైనల్, లేదా ఫైనల్ కీ చేరిన ఈ మ్యాచ్ లు కొలంబో లేదా దుబాయ్ వేదికగానే జరుగుతాయి.
2017లో పాకిస్తాన్ పై ఓటమి చవిచూసిన ఇండియా.. ఆ ఓటమికి ధీటుగా సమాధానం చెప్పేందుకు కసరత్తులు చేస్తుంది. అటు ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక 2024 27 సైకిల్ లో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే అన్ని మ్యాచ్ లకి రెండు దేశాలలో ఏది ఆతిథ్యం ఇస్తుందో దానికి భిన్నంగా.. ఇరుజట్లు తటస్థ వేదికలలో ఆడబోతున్నాయి. అంటే భవిష్యత్తులో ఏ టోర్నమెంట్ జరిగినా దానికి భారత్ ఆతిథ్యం ఇస్తే.. పాకిస్తాన్ జట్టు తన మ్యాచ్ లను తటస్థ వేదికలపై ఆడుతుంది.
Also Read: U19 Women’s Asia Cup: ఫైనల్‌కు చేరిన టీమిండియా
ఇక పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు కూడా వర్తిస్తుంది. ఇక ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025ని నిర్వహించే అవకాశం భారత్ చేతిలో ఉంది. అలాగే టి-20 ప్రపంచ కప్ 2026 ని భారత్, శ్రీలంకలు నిర్వహిస్తున్నాయి. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 ఐసీసీ ఈవెంట్ లో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 కోసం పోటీ పడనున్నాయి.