మూవీ : ముఫాసా: ది లయన్ కింగ్
రిలీజ్ డేట్ : 20 డిసెంబర్ 2024
Mufasa: The Lion King Movie Rating : 3/5
Mufasa: The Lion King Movie Review : 2019 లో ‘ది లయన్ కింగ్’ సినిమా వచ్చింది. 2016 లో వచ్చిన ‘జంగల్ బుక్’ ని ఆధారం చేసుకుని ‘వాల్ట్ డిస్నీ పిక్చర్స్’ ‘ ఫెయిర్ వ్యూ ఎంటర్టైన్మెంట్’ వారు ‘ది లయన్ కింగ్’ ని రూపొందించారు. దాని తెలుగు వెర్షన్ కూడా బాగా వచ్చింది. నాని, జగపతి బాబు, బ్రహ్మానందం, అలీ వంటి వారు తెలుగు వెర్షన్ కి డబ్బింగ్ చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సినిమా బాగా ఆడింది. ఇక దానికి ప్రీక్వెల్ గా ఇప్పుడు ‘ముఫాసా : ది లయన్ కింగ్’ ని రూపొందించారు. అయితే ఈసారి ‘ముఫాసా’ పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం వల్ల ప్రత్యేక ఆకర్షణ చేకూరింది అని చెప్పాలి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ముఫాసా’ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ :
ముఫాసా చనిపోయిన తర్వాత సింబా కూతురు కియారా- రఫీల మధ్య జరిగే సంభాషణ ఇది. కియారాకి తన తాత ముఫాస జీవితాన్ని కథగా చెబుతాడు రఫీకీ. ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన పాత్ర) చిన్నతనంలోనే కుటుంబానికి దూరమవుతాడు. తర్వాత మిలేలే అనే రాజ్యానికి వెళ్తాడు. అదే టైంలో టాకా (సత్య దేవ్ వాయిస్ ఇచ్చిన పాత్ర) ముఫాసకి దగ్గరవుతాడు . అయితే ఒబిసి రాజు ముఫాసాని తన రాజ్యంలోకి రావడానికి ఒప్పుకోడు. అనాథ అంటూ అతన్ని మనస్తాపానికి గురిచేస్తూ ఉంటాడు. కానీ టాకా మాత్రం ముఫాసాను అన్నలా చూసుకుంటాడు. తర్వాత అతను పిరికితనం వల్ల తెల్ల సింహాల గుంపు అతని తల్లి పై ఎటాక్ చేస్తుంటే ఏమీ చేయలేక పారిపోతాడు. అయితే ముఫాసా మాత్రం ముందడుగు వేసి ఆ తెల్ల సింహాల గుంపు యువరాజుని హతమారుస్తాడు. ఆ తర్వాత ముఫాసా, టాకా మిలేలే రాజ్యానికి వెళ్తారు. అక్కడ వీరికి శారభి పరిచయం అవుతుంది.తర్వాత రఫీకీ కూడా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత తెల్లసింహాల రాజు కిరోస్‌ను ఎదిరించి మిలేలే రాజ్యంలో ముఫాసా ఎలా నిలదొక్కుకున్నాడు అనేది తెరపై చూడాల్సిన కథ?
విశ్లేషణ :
కథగా చెప్పుకుంటే ఇది మన తెలుగు ప్రేక్షకులకి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే అనిపిస్తుంది. కానీ సింహాల బ్యాక్ డ్రాప్లో కథనం ఉండటంతో ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తుంది. అంతేకాదు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కూడా ‘ముఫాసా’ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మహేష్ బాబు వాయిస్ కి ఓ స్పెషాలిటీ ఉంటుంది. కామెడీ చేసినా.. విలన్ కి వార్నింగ్ ఇచ్చినా.. ఆ వాయిస్ కి టైమింగ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ముఫాసాలో సింహానికి డబ్బింగ్ చెప్పినా అంతే పర్ఫెక్ట్ సింక్ ఉంది. ఇక ముఫాసా అనే సింహంలో మహేష్ బాబుని చేసుకునేలా డబ్బింగ్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేసే విధంగా ‘ముఫాసా’ ఉంది అని చెప్పాలి. అయితే మొదటి భాగం చూసిన వాళ్లకి చాలా డౌట్లు ఉంటాయి. వాటికి సరైన కన్క్లూజన్ ఇవ్వడంలో దర్శకుడు బ్యారీ జెన్ కిన్స్ సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. విజువల్స్ కి వంక పెట్టడానికి లేదు. అన్నీ టాప్ నాచ్ అనే విధంగానే ఉన్నాయి. సెకండాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు వాయిస్ ఓవర్
సెకండాఫ్
స్క్రీన్ ప్లే
నిడివి
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళకి ఉండే కన్ఫ్యూజన్స్
రెగ్యులర్ స్టోరీగా అనిపించడం
మొత్తంగా.. ‘ముఫాసా : ది లయన్ కింగ్’ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మహేష్ అభిమానులే కాదు చిన్న పిల్లల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లాల్సిందే.
Mufasa: The Lion King Movie Rating : 3/5