Thaman – Chiranjeevi:తమన్ (Thaman ) ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ లో తన బాధను బయట పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా నెగిటివిటీ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..ఆ కామెంట్స్ కి బదులుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పందించడంతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉబ్బి తబ్బిబ్బవుతూ.. మెగాస్టార్ పోస్ట్ కి రిప్లై ఇచ్చారు. మరి అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి మాటలకు రిప్లై ఇచ్చిన తమన్..
తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఎంత కాదనుకున్న మనము మనుషులమే కదా ఒక్కొక్కసారి ఆ ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది అంటూ తెలిపారు. “డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా..! అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేసాయి. ఎంత కాదనుకున్నా మనం మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్థం చేసుకొని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. అంటూ జీవితాంతం సినిమా బ్రతికే ఉంటుంది అంటూ తమన్ రిప్లై ఇచ్చారు. మొత్తానికైతే తమన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
చిరంజీవి చేసిన ట్వీట్ లో ఏముందంటే..
“డియర్ తమన్.. నువ్వు నిన్న మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో కూడా ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే.. నువ్వు ఇంతలా స్పందించావో నాకు తెలుసు. విషయం సినిమా అయినా అది క్రికెట్ అయినా లేదా సామాజిక సమస్య అయినా సరే సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని కూడా ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే కానీ ఆ మాటలు ఒకరిని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి. కానీ ఆ మాటలు మనిషి యొక్క మనసును విరిచేలా ఉండకూడదు. ముఖ్యంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎంపిక చేసుకొని మరీ మాట్లాడాలి. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ కూడా మన జీవితాలను అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.
డాకు మహారాజ్ ఈవెంట్లో తమన్ ఎమోషనల్..
తాజాగా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రానికి సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక సినిమా ఎంత బాగున్నా సరే సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ ప్రచారం సినిమా పై పడుతుందని, కచ్చితంగా సోషల్ మీడియాలో మాటలు మరింత మానసిక వేదనకు గురిచేస్తాయని తమన్ బాధపడ్డారు.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️ @KChiruTweets 🥁 ✊
డియర్ అన్నయ్యా… మీ మాటలు నాకు
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన….
అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి.ఎంత కాదనుకున్నా మనుషులం కదా… ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది.
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని… కళ్ళు… https://t.co/Z8ueYVXFUG— thaman S (@MusicThaman) January 18, 2025