BigTV English

Shock to BRS: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ‘మీడియా’ పోల్.. ఊహించని ఫలితానికి అంతా షాక్

Shock to BRS: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ‘మీడియా’ పోల్.. ఊహించని ఫలితానికి అంతా షాక్

Shock to BRS: అంతలేదన్నారు.. ఇంతలేదన్నారు.. చివరికి నెటిజన్స్ ఇచ్చిన షాక్ తో సైలెంట్ అయ్యారు. తెలంగాణలో ఏడాది పాలన ఎలా ఉందంటూ బీఆర్ఎస్ అనుకూల మీడియా ఓ సర్వే చేసింది. అంతా తాము అనుకున్నట్లు రిజల్ట్ వస్తుందనుకున్నారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. అనుకున్నదొకటి, అయిందొకటి తరహాలో ఊహించని షాక్ బీఆర్ఎస్ కు తగిలిందని చెప్పవచ్చు.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాదిలో ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్, జాబ్స్ నోటిఫికేషన్స్, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి, రుణమాఫీ, ఇలా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అంతేకాదు ఈనెల 26న ఓకే రోజు మూడు బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. రైతు భరోసా పేరుతో రైతులకు రూ. 12000, కూలీలకు రూ. 12000, కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్దమవుతోంది.

ఇటీవల ఏడాది పాలన పూర్తి చేసుకున్న సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలలో విజయోత్సవ సభలను సైతం నిర్వహించారు. ఈ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి, ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు పలికారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద విజయోత్సవాల ముగింపు వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇలా ఓ వైపు రాష్ట్ర అభివృద్దితో పాటు, ప్రజా సంక్షేమ పథకాలను సైతం ప్రవేశపెడుతూ సీఎం రేవంత్ సర్కార్ ప్రజల మనసులు గెలుచుకుందని కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు.


అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సమయం ఉన్నప్పుడల్లా అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సంధర్భంగానే కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన బీఆర్ఎస్ కు తట్టిందట.

తన అనుకూల మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై అభిప్రాయాలు తెలుసుకోమని హుకుం జారీ చేసింది. ఆ మీడియా ప్రతినిధులు కూడ ప్రత్యేకమైన పోల్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలా ఉందంటూ, బాగుంది అనే ఆప్షన్, ఫర్వాలేదు అనే ఆప్షన్, అస్సలు బాగాలేదు అంటూ పోల్ పెట్టారు.

తాము అనుకున్న రీతిలో ఫలితాలు వస్తాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేయచ్చన్న ఆలోచన వచ్చిందో ఏమో కానీ, పోల్ రిజల్ట్స్ మాత్రం భారీ షాకిచ్చాయి. బీఆర్ఎస్ అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోగా, బాగుంది అంటూ 70 శాతం ప్రజలు అభిప్రాయాన్ని తెలుపగా, ఫర్వాలేదు అంటూ 19 శాతం మంది రిజల్ట్స్ ఇచ్చేశారు.

Also Read: CPR to New Born Baby: చిట్టి గుండెకు CPR.. అప్పుడే పుట్టిన పాపకు తిరిగి ప్రాణం పోసిన అంబులెన్స్ టెక్నీషియన్

కేవలం 11 శాతం మంది మాత్రమే బాగాలేదు అంటూ రిప్లై ఇచ్చారు. అరెరె ఇదేంటిది.. తాము ఏదో అనుకుంటే ఇలా రిజల్ట్స్ వచ్చిందేంటి అంటూ బీఆర్ఎస్ ఖంగుతిందట. దీన్ని బట్టి కాంగ్రెస్ సర్కార్ కి తెలంగాణ ప్రజల మద్దతు భారీగానే ఉందని గ్రహించిన బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారట. మరి అంతేకదా.. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా తెగ ఆనంద పడిపోతోంది. కొసమెరుపు ఏమిటంటే.. అనుకోని షాక్ తో బీఆర్ఎస్ అనుకూల మీడియా ఆ పోల్ ను తొలగించినట్లు సమాచారం.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×