Vijayanagaram Accident : ఓ వైద్య కళాశాల నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులో పాల్గొనేందుకు వస్తూ..రోడ్డు ప్రమాదానికి గురైంది ఓ మెడికల్ కాలేజీ బస్సు . వేగంగా వచ్చి.. మంచు కారణంగా ఎదురుగా ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. బస్సులోని మిగతా వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి ఐదు అంబులెన్సులు చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని వెనువెంటనే ఆసుపత్రులకు తరలించాయి. ఈ ఘటన విజయ నగరంలో చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండలం మదుపాడ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అనిల్ నీరుకొండ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కు చెందిన బస్సు లారీని ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ బస్సు ఒడిస్సా నుంచి వస్తుండగా.. జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఒడిస్సాలోని మల్కాజ్ గిరి నుంచి విజయనగరం జిల్లాలోని తగరపు వలసకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
లోడ్ తో వెళుతున్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టడంతో మెడికల్ కాలేజీ బస్సు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే తండ్రీ, కూతులు మృతి చెందగా.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా..బాధితులంతా ఒడిస్సాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు బాధితులకు సాయంగా నిలిచారు. ఐదు అంబులెన్సులు సైతం ప్రమాద స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుల్ని సమీపంలోని వైద్యశాలలకు తరలించాయి. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ALSO READ : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, దేనికి?