BigTV English

Karthi: ప్రభాస్ సాంగ్.. ఎంత అద్భుతంగా పాడావ్ కార్తీ అన్నా.. ఫిదా అంతే

Karthi: ప్రభాస్ సాంగ్.. ఎంత అద్భుతంగా పాడావ్ కార్తీ అన్నా.. ఫిదా అంతే

Karthi: కోలీవుడ్ హీరో కార్తీ అని చెప్పడం కన్నా..  మన తెలుగు నటుడు కార్తీ అని చెప్పుకోవడంలో అస్సలు ఆశ్చర్యపోనవసరం లేదు.  కార్తీ  పుట్టింది చెన్నైలోనే అయినా.. పెరిగింది అంతా హైదరాబాద్ లోనే.  అతనికి ఉన్న ఫ్రెండ్స్ అందరు తెలుగువారే. అంతెందుకు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, కార్తీ క్లాస్  మేట్స్. అందుకే కార్తీకి తెలుగు బాగా వచ్చు. ఇండస్ట్రీకి సూర్య ముందు వచ్చినా.. తెలుగులో ఆయనకు ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉన్నా కూడా అందరు కార్తీనే హైదరాబాద్ కుర్రాడు అని అనుకుంటారు.


ఇక ఇదంతా పక్కన పెడితే.. కార్తీ కథల ఎంపికకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అసలు ఎవరు  ఊహించని కథలతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్  చేస్తూ ఉంటాడు. ఒక యుగానికి ఒక్కడు, ఒక నా పేరు శివ,  ఒక ఖైదీ.. ఇక ఇప్పుడు సత్యం సుందరం. అసలు హైప్ కూడా లేని ఒక చిన్న సినిమా సత్యం సుందరం. తిరుపతి లడ్డూ వివాదం వలన ఆ సినిమాకు హైప్ వచ్చింది. ఎంత హైప్ వచ్చినా కూడా  కథ నచ్చితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. మౌత్ టాక్ ఎక్కువ పాజిటివ్ గా రావడంతో ప్రేక్షకులు  ఆ సినిమాకు  క్యూ కట్టారు.

దేవర లాంటి పెద్ద సినిమాతో పోటీ పడి నిలిచిన సినిమాగా సత్యం సుందరం రికార్డ్ సృష్టించిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను  చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. చిత్ర బృందం మొత్తం వరుసగా కాలేజ్ లకు వెళ్లి తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. తాజాగా కార్తీ.. సత్యం సుందరం సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక కాలేజ్ ను సందర్శించారు. ఇక ఆ వేడుకలో కార్తీ.. ప్రభాస్ సాంగ్ పాడడం హైలైట్ గా నిలిచింది.


నిజం చెప్పాలంటే కార్తీ వాయిస్ చాలా బావుంటుంది. ఇప్పుడే కాదు గతంలో కూడా కార్తీ ఈవెంట్స్ లో తెలుగు సాంగ్స్ ను ఆలపించి అలరించాడు.  ఇప్పుడు ప్రభాస్ నటించిన  పౌర్ణమి సినిమాలోని మువ్వలా నవ్వకలా.. ముద్దా మందారామా అంటూ ఆలపించాడు. తెలుగు మొత్తం రాకపోయినా.. చూసి ఆ సాంగ్ ను ఎంతో అద్భుతంగా పాడి అందరిని ఫిదా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. ప్రభాస్ సాంగ్ ఎంత అద్భుతంగా పాడావ్  కార్తీ అన్నా.. ఫిదా అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా కార్తీ బంగారం రా అంటూ చెప్పుకొస్తున్నారు.

Related News

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Big Stories

×