EPAPER

Hasith Goli : భలే ప్లాన్ చేసాడు, ఈ ఒక్క సినిమాతో నాలుగు ఫ్రీక్వెల్స్ రాయొచ్చు

Hasith Goli : భలే ప్లాన్ చేసాడు, ఈ ఒక్క సినిమాతో నాలుగు ఫ్రీక్వెల్స్ రాయొచ్చు

Hasith Goli : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది యంగ్ టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. వారిలో ప్రతి దర్శకుడికి ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడంతో పాటు లిరిక్స్ కూడా అందించాడు హసిత్ గోలి. సహాయ దర్శకుడిగా కొన్ని సినిమాలకు పనిచేసి ఆ తర్వాత రాజరాజ చోరా అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే ఒక యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరికాడు అని అనిపించుకున్నాడు. ఈ సినిమాలోని ప్రతి డీటైలింగ్ సినిమా ప్రేమికుడిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాని డీల్ చేసిన విధానం ఈ సినిమాలోని చాలా మూమెంట్ ఇప్పటికీ కూడా హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తాయి. అంటే ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చు అని చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించేలా తన మొదటి సినిమా తెరకెక్కించాడు.


ఇక ప్రస్తుతం హాసిత్ చేస్తున్న సినిమా స్వాగ్. శ్రీ విష్ణు రీతు వర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది చిత్ర యూనిట్. ఈ సినిమాపై టీం అంతా కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉంది. రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ఈవెంట్ లో కూడా దర్శకుడు మాట్లాడుతూ 2024లో మీరు బెస్ట్ ఇంటర్వెల్స్ ని చూడబోతున్నారు, బెస్ట్ క్లైమాక్స్ సీన్ చూడబోతున్నారు, అలానే బెస్ట్ ఫిలిం చూడబోతున్నారు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు. దర్శకుడు తో పాటు టీమ్ అంతా కూడా ఈ సినిమాను బలంగా నమ్ముతున్నారు.

ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా కథకి చాలా స్కోప్ ఉంది అని రివిల్ చేశాడు శ్రీ విష్ణు. ఈ సినిమాలో శ్రీ విష్ణు నాలుగు పాత్రలలో కనిపిస్తున్నాడు. ఈ నాలుగు పాత్రలు కూడా సినిమాలో హాఫ్ వే లో ఓపెన్ అవుతాయి. అంటే ఒక్కో పాత్రకి ఫ్రీక్వెల్ స్టోరీ రాసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ ఒక్క సినిమాతో నాలుగు ఫ్రీక్వెల్ స్టోరీస్ రాయడానికి స్కోప్ ఉంది అని చెప్పాలి. ఏదేమైనా ఈ సినిమా వర్కౌట్ అయితే హాసిత్ అద్భుతమైన ప్లాన్ చేసాడు అని చెప్పొచ్చు. అలానే ఈ సినిమాకి రాజ రాజ చోర సినిమాకి కూడా లింక్ ఉండే అవకాశం ఉంది అని కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వీటన్నిటి విషయంలో కూడా అక్టోబర్ 4న క్లారిటీ రానుంది.


Related News

Janaka Aithe Ganaka Censor : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పచ్చి బూతులు… అమ్మబాబోయ్ భరించలేం..

Vettaiyan: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వేట్టయాన్’ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

Viswam Censor : మూవీ చూసి బెదిరిపోయిన సెన్సార్ బోర్డ్… మొత్తం 14 కట్స్.. ఏ సీన్స్ కట్ చేశారంటే..?

JD Chakravarthy: చిరంజీవి.. పరమ దుర్మార్గుడు.. 8 రోజులు అలా..

Naga Chaitanya: నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు?

Prabhash : రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించిన ప్రభాస్..!

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Big Stories

×