Sandeep reddy vanga latest news(Tollywood celebrity news): సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, గాడ్ ఫాదర్ లేకుండా ఎదుగుతారు కొందరు. మరికొందరు. మరికొందరు వారసత్వంగా వచ్చిన పేరు చెప్పుకుని సినిమా ఇండస్ట్రీలో చలామణి అవుతుంటారు. అయితే మొదటి రకానికి చెందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కొంతకాలంగా అసిస్టెంట్ దర్శకుడిగా వైవిధ్యమున్న దర్శకుల వద్ద చేరాడు. చేస్తున్న వృత్తిలో సంతృప్తి లేదు. తనకి తానుగా ఎదగాలని అనుకున్నాడు. కసిగా ఓ సినిమాకి స్క్రిప్ట్ రాసుకున్నాడు. రెండేళ్లు ఆ కథపై కసరత్తు చేశాడు. అతని కథ చూసి అంతా చప్పరించారు. ఇలాంటి నెగెటివ్ క్యారెక్టర్ చాలా వైలెంట్ గా ఉందని చెప్పి ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు తన బ్రదర్ నిర్మాణ సారధ్యంలో సొంతంగా ఈ మూవీని ఆత్మవిశ్వాసంతో పూర్తిచేశాడు. అదే అర్జున్ రెడ్డి.
ముందుగా శర్వానంద్ ని హీరోగా అడిగారు. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక శర్వానంద్ తప్పుకున్నాడు. విజయ్ దేవరకొండ అప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. పెళ్లిచూపులు చిత్రంతో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న అర్జున్ రెడ్డి మూవీని తీసి సూపర్ హిట్ చేశాడు. హిందీలోనూ కబీర్ సింగ్ పేరుతో తీసిన ఈ మూవీ హిట్ కావడంతో సందీప్ వంగా పేరు మార్మోగిపోయింది. లేటెస్ట్ గా రణబీర్ కపూర్ తో తీసిన యానిమల్ కూడా రికార్డు కలెక్షన్లు దక్కించుకుంది. త్వరలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని తీస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పేరు వెనుక మిస్టరీ
అయితే సందీప్ వంగా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ తన కొడుకు పేరు వెనక ఉన్న మిస్టరీని విప్పారు. తన కొడుకు పేరు అర్జున్ రెడ్డి అని పెట్టుకున్నాడట. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే తనకు కొడుకు పుట్టడంతో ఆ పేరు మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అదే పేరు పెట్టుకున్నానని చెప్పాడు. దానితో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అర్జున్ రెడ్డి పేరును సందీప్ ఎంతగా ప్రేమించాడో కదా..ఆ స్క్రిప్ట్ మీద నమ్మకంతోనే సొంత ఆస్తులు అమ్మి సినిమాను సైతం నిర్మించాడు అని అతని గట్స్ చూసి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.