BigTV English
Advertisement

India’s Oldest Trains: వందేళ్లుగా.. ఒకే మార్గంలో నడుస్తున్న ఈ రైళ్ల గురించి తెలుసా? నిజంగా గ్రేట్!

India’s Oldest Trains: వందేళ్లుగా.. ఒకే మార్గంలో నడుస్తున్న ఈ రైళ్ల గురించి తెలుసా? నిజంగా గ్రేట్!

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థలో భారతీయ రైల్వే టాప్ ప్లేస్ లో ఉంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. భారత్ లో తొలిసారి ఏప్రిల్ 16, 1853న రైలు ప్రయాణం ప్రారంభం కాగా, ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించింది. అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైల్వే లైన్లు ఏర్పడ్డాయి. అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, కొన్ని రైళ్లు వందేళ్లకు పైగా చరిత్రను కలిగి ఉన్నాయి. ఇప్పటికీ పలు మార్గాల్లో నడుస్తున్నాయి. ఇంతకీ ఆ చారిత్రక రైళ్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ కల్కా మెయిల్

ఈ రైలు 1866లో ఈస్ట్ ఇండియన్ రైల్వే మెయిల్‌ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ రైలు బ్రిటిష్ అధికారులు, పరిపాలనా యంత్రాంగాన్ని కలకత్తా నుంచి వేసవి రాజధాని అయిన సిమ్లాకు తీసుకెళ్లేది. హౌరా- కల్కా దగ్గర ఉన్న ప్రత్యేక క్యారేజ్‌ వేలు ఉన్నత స్థాయి అధికారులు తమ కోచ్‌ల వరకు నేరుగా ప్రయాణించడానికి వీలు కల్పించేవి. ఈ విలాస వంతమైన రైలు ఇప్పటికీ నడుస్తుంది. 150 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కల్కా మెయిల్, స్వాతంత్ర్యానికి ముందు రోజుల నుంచి విభజన అల్లకల్లోలం వరకు భారత చరిత్రలో అనేక కీలకమైన క్షణాలకు సాక్షిగా ఉంది. ఈ రైలును ఇప్పుడు నేతాజీ ఎక్స్‌ ప్రెస్ గా పిలుస్తున్నారు. కల్కా-సిమ్లా మార్గంలో నడుస్తుంది.

⦿ పంజాబ్ మెయిల్

దేశంలోని పురాతన సుదూర రైళ్లలో పంజాబ్ మెయిల్ ఒకటి. ఇది రీసెంట్ గా 106 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిని గతంలో పంజాబ్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఒకప్పుడు బొంబాయి నుంచి పెషావర్‌ కు ప్రయాణికులను తీసుకెళ్లే ఏకైక రైలు. ఇది దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందింది. 1914లో రైలు ప్రారంభ స్టేషన్ విక్టోరియా టెర్మినస్‌ గా ఉండేది.  1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఫిరోజ్‌ పూర్‌ ను రైలు టెర్మినస్ పాయింట్‌గా ప్రకటించారు. ఈ రైలు ఏకబిగిన 47 గంటల పాటు దాదాపు 2500 కి.మీ. ప్రయాణిస్తుంది.


⦿ ఫెయిరీ క్వీన్

అదేశంలోని అత్యంత పురాతనమైన స్టీమ్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. 1855లో అందుబాటులోకి వచ్చింది. రెగ్యులర్ సర్వీస్‌లో పనిచేస్తున్న పురాతన స్టీమ్ లోకోమోటివ్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ పొందింది. మొదట ఢిల్లీ- అల్వార్ మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి ఉపయోగించారు. ఇప్పుడు పర్యాటకులకు తీసుకెళ్లడానికి ఉపయోగిస్తున్నారు.

⦿ బాంబే పూనా మెయిల్

1869లో ప్రారంభమైన బాంబే-పూనా మెయిల్ రెండు నగరాల మధ్య మొదటి ఇంటర్‌ సిటీ రైలు. బ్రిటిష్ పాలనలో దేశంలోని అత్యుత్తమ రైళ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు అద్భుతమైన లక్షణం కదిలే కుర్చీలు. వీటిని ప్రయాణీకులు  రైలు ప్రయాణం దిశలో చూసేలా తిప్పవచ్చు. 1971లో దీని పేరు మార్చారు.   బాంబే పూనా మెయిల్ ఇప్పుడు రెండు నగరాల మధ్య సహ్యాద్రి ఎక్స్‌ ప్రెస్‌గా సేవలు అందిస్తుంది.

Read Also: హైదరాబాద్ నుంచి మదీనాకు నేరుగా విమానాలు, గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో!

Related News

Lower Berth: రైలులో లోయర్ బెర్త్ కావాలా? మారిన ఈ రూల్స్ గురించి ముందుగా తెలుసుకోవల్సిందే!

Hyderabad–Madinah Flights: హైదరాబాద్ నుంచి మదీనాకు నేరుగా విమానాలు, గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో!

IRCTC Tour Package: భారత్ గౌరవ్ ట్రైన్‌తో దక్షిణ భారత ఆలయాల దివ్య దర్శనం.. భక్తుల కోసం సువర్ణావకాశం

Viral Video: రైల్వే స్టేషన్‌లో మెట్లు దిగలేక వికలాంగుడి పాట్లు.. వెంటనే రైల్వే పోలీస్ ఏం చేశాడంటే..

IRCTC Master List: టికెట్ కన్ఫార్మ్ కావడానికి ఇదో కొత్త ట్రిక్.. మాస్టర్ లిస్ట్‌తో ఇలా ట్రై చేయండి!

IRCTC Down: షాకింగ్.. 6 గంటల పాటు IRCTC వెబ్ సైట్ డౌన్.. కారణం ఏంటంటే?

AP Trains: ఏపీలో రైళ్లకు మరింత వేగం.. రైల్వేశాఖ కీలక నిర్ణయం!

Big Stories

×