E-Paper
Advertisement

Mythri Movie Makers : బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థతో మైత్రి బిగ్గెస్ట్ డీల్… పెద్ద ప్లానే

Mythri Movie Makers : బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థతో మైత్రి బిగ్గెస్ట్ డీల్… పెద్ద ప్లానే
Advertisement

Mythri Movie Makers : పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ పూర్తిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. అడపా దడపా తప్ప పెద్దగా బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలేమీ ప్రేక్షకులను ఆకట్టుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బడా హీరోలు అందరూ సౌత్ పై కన్నేస్తున్నారు. అందులో కొందరు స్టార్ హీరోలు సౌత్ భాషలో నటించడానికి ఆసక్తిని కనబరుస్తుంటే, మరి కొంతమంది మాత్రం సౌత్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి అడుగులేస్తున్నారు. నటీనటులు మాత్రమే కాదు నిర్మాతలు కూడా ఇదే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియన్ సినిమాతో బాలీవుడ్ ను కనెక్ట్ చేయడానికి ప్రముఖ హిందీ సినిమాల నిర్మాత భూషణ్ కుమార్ కష్టపడుతున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తో బిగ్గెస్ట్ డీల్ కుదుర్చుకున్నారు.

పెద్ద ప్లానే…

Advertisement

మైత్రి మూవీ మేకర్స్ తో భూషణ్ కుమార్ కు సంబంధించిన నిర్మాణ సంస్థ టి సిరీస్ ఓ బిగ్గెస్ట్ డీల్ ను కుదుర్చుకుంది. ఈ రెండు నిర్మాణ సంస్థలు కలిసి పలు పాన్ ఇండియా సినిమాలను రూపొందించబోతుండడం విశేషం. అందులో భాగంగానే ‘పుష్ప2 ‘ నుంచి మొదలు పెడితే ప్రభాస్ ‘ఫౌజి’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో పాటు అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి ప్రాజెక్టులలో కలిసి పని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తెలుగు మార్కెట్ పై దృష్టి సారిస్తే, బాలీవుడ్ కు సంబంధించిన ప్రాంతాల్లో టి సిరీస్ ఆ సినిమాలను మార్కెట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ రెండు సంస్థలు కలిసి చేస్తున్న ఈ పని రెండు బ్యానర్లకు కూడా ముఖ్యమైనదే. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే తెలుగు సినిమాలని నిర్మించడంలో అగ్రస్థానంలో ఉంది. ఇక మైత్రికి ఈ డీల్ సౌత్ లో కాకుండా ఇతర ప్రాంతాల్లో విజిబిలిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఈ సినిమాలతో పాటు మైత్రి భారతదేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరిన్ని ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. మరోవైపు భూషణ్ కుమార్ కూడా ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో పలు బిగ్గెస్ట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

మైత్రి, టి సిరీస్ కాంబోలో రాబోతున్న సినిమాలు…

Advertisement

‘పుష్ప 2’తో ఈ రెండు సంస్థల ప్రయాణం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే భూషణ్ కుమార్ ‘పుష్ప 2’ సినిమాలో పెట్టుబడి పెట్టారు. పైగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ రైట్స్ కూడా సొంతం చేసుకున్నారు.. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ‘డ్రాగన్’, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు మైత్రి, టి సిరీస్ కలిసి చేయబోతున్న సినిమాల లిస్ట్ లో ఉన్నాయి. పైన పేర్కొన్న సినిమాలను బాలీవుడ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి టి సిరీస్ సహకరించబోతోంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది అని చెప్పొచ్చు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×