BigTV English
Advertisement

Raja Saab Movie : రాజా సాబ్ మరో రికార్డు… నైజాం రాజు ఎప్పటికైనా ప్రభాసే…

Raja Saab Movie : రాజా సాబ్ మరో రికార్డు… నైజాం రాజు ఎప్పటికైనా ప్రభాసే…

Raja Saab : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో అంటే టక్కున ప్రభాస్ పేరే వినిపిస్తుంది.. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాడు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.. ఈ ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ ఏడాది హైయేస్ట్ గ్రాస్ ను కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీ లోకి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాల‌కు సీక్వెల్స్ రానున్నాయి.. ఇప్పుడు మరో నాలుగు సినిమాలతో రాబోతున్నాడు డార్లింగ్.. ముందుగా ‘రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా మూవీ నైజాం రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.


ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ‘ది రాజాసాబ్’ గురించి పలు ఇంటర్వ్యూ లలో ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడం పక్కా అనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్న అంతకు మించి ఉంటుందని అంటున్నారు. నిజం చెప్పాలంటే కల్కి తర్వాత రాబోతున్న సినిమా పై భారీ అంచనాలే ఉంటాయి. కానీ ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అవ్వలేదు.. ఈ మూవీ మేకర్స్ మాత్రం సినిమాను జనాలకు రీచ్ అయ్యేలా చేసే ప్లాన్ చేస్తున్నారు..

ఇదిలా ఉండగా.. ఈ మూవీ థీయాట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ , డిస్టిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. భారీ ధరకి ఈ రైట్స్ ని మైత్రీ వారు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సంధ్య 70 ఎంఎం లో ది రాజాసాబ్ చిత్రాన్ని లాక్ చేసారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక మిగిలిన ఏరియాల్లో థీయాట్రికల్ రైట్స్ గురించి పూర్తి సమాచారం త్వరలోనే తెలియనుంది.. ఏప్రిల్ 10, 2025న ‘ది రాజాసాబ్’ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఐదు భాషలలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోయే ఈ సినిమాపై రూ. 400 కోట్ల వరకు థీయాట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. రొమాంటిక్, కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో సినిమా రాబోతుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. సంజయ్ దత్ ప్రతి కథానాయకుడి పాత్రలో నటిస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×