BigTV English

Star Heroine: జూన్లో నిశ్చితార్థం.. కట్ చేస్తే ఇంకొకరితో పెళ్లి..!!

Star Heroine: జూన్లో నిశ్చితార్థం.. కట్ చేస్తే ఇంకొకరితో పెళ్లి..!!

Star Heroine.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారు..? ఎవరితో నిశ్చితార్థం చేసుకుంటారు ? ఎవరిని వివాహం చేసుకుంటారు? అనే విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా ఎందుకు అనాల్సి వస్తోంది అంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జరిగే పరిస్థితులను బట్టి చూస్తే ఇలా అనక మానదు. సాధారణంగా ఒక వ్యక్తిని ప్రేమించి, నిశ్చితార్థం చేసుకొని, పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతమంది ఒకరిని ప్రేమించి, ఇంకొకరితో నిశ్చితార్థం చేసుకొని, మరొకరిని వివాహం చేసుకుంటూ ఉంటారు. అలాంటి లిస్టులోకి మలయాళ నటి శ్రీ గోపిక (Sri gopika) కూడా చేరిపోయింది.


జూన్ నెలలో నిశ్చితార్థం..

తాజాగా ఈ ముద్దుగుమ్మ వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి , అందరిని ఆశ్చర్యపరిచింది. వరుణ్ దేవ్ అనే వ్యక్తితో ఏడడుగులు వేశానని స్పష్టం చేసింది. ఈ మేరకు తనకు పెళ్లి జరిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. అందులో చాలా సింపుల్ గా, క్యూట్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా గతంలో తన బెస్ట్ ఫ్రెండ్ వైశాఖ్ రవితో పెళ్లికి సిద్ధమైన ఈమె ఏడాది జూన్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే పెళ్లి చేసుకోవాలనుకునే లోపే ఇద్దరూ విడిపోయారు నిశ్చితార్థం ఫోటోలను కూడా డిలీట్ చేశారు.


అక్టోబర్లో ఇంకొకరితో పెళ్లి..

అయితే జూన్ నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సడన్గా విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియ రాలేదు. మరోవైపు ఇప్పుడు శ్రీ గోపిక మాత్రం ఇంకొక వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ జంట కలిసి ఉండాలని కోరుకుంటూ పోస్ట్లు కూడా పెడుతున్నారు. ఏదేమైనా జూన్లో ఒక అతనితో నిశ్చితార్థం చేసుకున్న ఈమె ఇప్పుడు సడన్గా ఇంకొక వ్యక్తితో ఏడడుగులు వేసేసరికి కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు అంటూ అప్పుడే ఆరా తీయడం మొదలుపెట్టారు.

గోపిక సినిమాలు..

90 ఎంఎల్ అనే తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది శ్రీ గోపిక. ఆ తర్వాత రూల్ నెంబర్ 4, వోల్ఫ్ వంటి చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన నాన్సెన్స్ అనే మలయాళ సినిమాలో కూడా నటించింది. ఒకవైపు సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీ గోపిక సీరియల్స్ లో కూడా నటించింది బుల్లితెరపై ప్రసారమైన ఉయిరే అనే సీరియల్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు సమాచారం.. ఇక శ్రీ గోపిక ఇలాగే వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆమె జీవితం సుఖమయం కావాలి అని అభిమానులు కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక శ్రీ గోపిక విషయానికి వస్తే.. కేవలం తమిళ్ ,మలయాళం చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఈమె.. తెలుగులో నటించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి తెలుగు అవకాశాలు ఈమెకు వస్తాయా వస్తే నటిస్తుందా అన్నది చూడాలి.

 

View this post on Instagram

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×