BigTV English

Prasad Behara: ఆడాళ్లను వేధించడమే పని.. ఒక్క అమ్మాయిని కూడా వదిలేది లేదు

Prasad Behara: ఆడాళ్లను వేధించడమే పని.. ఒక్క అమ్మాయిని కూడా వదిలేది లేదు

Prasad Behara: కొన్నిసార్లు స్టార్ డమ్ వలన జరిగే నష్టాల వలన సెలబ్రిటీల జీవితాలు నాశనం అవుతాయి అని  అనడం ఎటువంటి అతిశయోక్తి లేదు.  సక్సెస్ రానంతవరకు  వారిపై ఎలాంటి వివాదాలు రావు. ఒక్కసారి సక్సెస్ ను అందుకున్నారు అంటే.. వారు ఏం చేసినా వివాదమే. అందుకే సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హీరోయిన్స్ సైతం అంతకు ముందులా  క్యాస్టింగ్ కౌచ్ కు కానీ, లైంగిక వేధింపులకు గానీ భయపడడం లేదు. నిర్మొహమాటంగా బయటకు వచ్చి  తమను వేధించిన వారిని  ఊచలు లెక్కించేలా చేస్తున్నారు.


టాలీవుడ్ లో గత కొంతకాలంగా లైంగిక వేధింపుల కేసులు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న జానీ మాస్టర్ .. ఆ తరువాత  హర్ష సాయి.. నిన్న యూట్యూబర్ ప్రసాద్ బెహరా..  అమ్మాయిలను లైంగికంగా వేధించినందుకు జైలుకు వెళ్లారు. విడాకులు అనే వెబ్ సిరీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకేమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్.. పెళ్లి వారమండీ  అనే సిరీస్ ను  తెరకెక్కించాడు. ఈ సిరీస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా మూడు సీజన్స్  రిలీజ్ చేశారు. మూడు సీజన్స్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

Nandamuri Balakrishna: బాలకృష్ణ నా తమ్ముడు కాదు.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వీడియో వైరల్


ఇక వెబ్ సిరీస్ వలన వచ్చిన గుర్తింపుతో మెగా డాటర్ నిహారిక.. ప్రసాద్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆమె నిర్మాతగా  కమిటీ కుర్రోళ్ళు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. అంతా బావుంది అనుకొనేలోపు అతడి ప్రవర్తన .. జైలుకు పంపేలా చేసింది.   తన వెబ్ సిరీస్ లో నటించిన ఒక నటిని లైంగికంగా వేధించినందుకు ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెల్సిందే.

ఇక ఇదంతా పక్కన పెడితే..  తాజాగా ప్రసాద్ నటించిన లీలా వినోదం సిరీస్ సునీక్ పీక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్  జస్వంత్ హీరోగా నటించిన ఈ సిరీస్  ఈటీవీ విన్ లో  ప్రసారం అవుతుంది. ఇక ఆ సిరీస్ కు హైప్ పెంచడానికి.. సిరీస్ లో ఉన్న కీలక పాత్ర అయిన ప్రసాద్ బెహరా క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఈ సిరీస్ లో వద్దు శీను అనే పాత్రలో ప్రసాద్ కనిపించాడు. ఊర్లో ఒకటే రీఛార్జ్ షాప్ ఉండడంతో అందరూ శ్రీను దగ్గరకే వచ్చి రీఛార్జ్ చేయించుకుంటారు.

Pushpa 2: కుర్రాళ్లను కిర్రెక్కించే కిస్సిక్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..

ఇక అతని దగ్గరకు వచ్చిన వారందరి దగ్గర నుంచి అమ్మాయిల నంబర్స్ తీసుకొని వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు.  ఊళ్లోఅందరి  ఆడాళ్ళను వేధించడమే కానీ  .. నన్ను ఒక్క ఆడది ప్రేమించలేదు.  నా ఖాతాలో ఇంకో గుంట బలి. ఏ ఒక్క అమ్మాయిని వదిలేది లేదు. అనే డైలాగ్స్ బాగా పేలాయి. అయితే ప్రసాద్ పై కేసు నమోదు కావడం .. సేమ్ ఇలానే అతను బయట  కూడా అమ్మాయిలను వేధించడం  చూసి.. మనోడి  గురించి  మనోడే రాసుకున్నట్లు ఉన్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×