BigTV English

Akash Puri : నాకు చిరంజీవి గారు దేవుడుతో సమానం, కానీ ఆయనతో పని చేయాలని లేదు

Akash Puri : నాకు చిరంజీవి గారు దేవుడుతో సమానం, కానీ ఆయనతో పని చేయాలని లేదు

Akash Puri : స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పూరి జగన్నాథ్ తీసే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టర్ ను చాలా బాగా రాస్తాడు దాని కోసమైనా సినిమాకి వెళ్లాలి అంటూ డిసైడ్ అయిన ఆడియన్స్ చాలా మంది ఉండేవాళ్ళు. అలానే రవితేజ,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ , ప్రభాస్ వంటి హీరోల అందరితో కూడా సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్నాడు. పూరి పీక్ లో ఉన్న టైంలో తన కొడుకు ఆకాష్ పూరి పూరి సినిమాల్లో కనిపిస్తూ ఉండేవాడు.


చిన్న చిన్న సినిమాల్లో పాత్రలను పోషించిన ఆకాష్. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన ధోని సినిమాతో మంచి గుర్తింపును పొందుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్ర పోరి అనే సినిమాను కూడా చేశాడు. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెహబూబా అనే సినిమాకు పనిచేశాడు ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఆ తర్వాత రొమాంటిక్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఆకాష్ ఆ సినిమా కూడా డిజాస్టర్.

జార్జి రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో చోర్ బజార్ అనే సినిమాలో కనిపించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఆకాష్ మంచి టాలెంట్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ స్క్రిప్ట్ సెలక్షన్స్ లో ఆకాష్ చాలా పూర్ అని చెప్పాలి. సరైన కథను ఎన్నుకోవడంలో తడబడుతున్నాడు. ప్రస్తుతం గత రెండేళ్ల నుంచి ఆకాష్ ఒక సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం తల్వార్ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో పాటు కలిసి చూడాలి అని ఆశపడుతున్నాడట ఈ యంగ్ హీరో. రీసెంట్గా హాజరైన ఒక షోలో ఆకాష్ పూరి మాట్లాడుతూ… నాకు మెగాస్టార్ చిరంజీవి గారు దేవుడితో సమానం, ఆయనతో కలిసి ఒక సినిమా చూడాలి అని అనుకుంటున్నాను. అది తల్వార్ (Thalvar Movie) సినిమా అవుతుంది అని ఊహిస్తున్నాను. నటించాలి అని అనుకోవట్లేదా అని అడిగితే, నేను అలా అనుకోవట్లేదు కానీ మా నాన్న చిరంజీవి గారి కలిసి పనిచేయాలి అని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్.


గతంలో చాలాసార్లు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి. మెగాస్టార్ రీఎంట్రీ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడు అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే చివరి నిమిషంలో అది మిస్ అయింది. ఇలా చాలా సందర్భాల్లో చిరంజీవితో చేయాల్సిన సినిమా పూరి జగన్నాథ్ కి ఆగిపోయిన విషయం తెలిసిందే.

Also Read : Nidhi Agarwal: హీరోతో ప్రేమాయణం.. చేతురాలా జీవితాన్ని పాడు చేసుకుందా..?

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×