E-Paper
Advertisement

Mega Brothers : మెగా బ్రదర్స్ బంధం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్..

Mega Brothers : మెగా బ్రదర్స్  బంధం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్..
Advertisement

Mega Brothers : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మెగా కుటుంబం ఏ ఫంక్షన్ అయినా కలిసికట్టుగా ఎంతో పద్ధతిగా జరుపుకుంటారు అనే విషయం ఈ పెళ్లి ద్వారా మరొకసారి అందరికీ అర్థమైంది. అనారోగ్య కారణం వల్ల మెగాస్టార్ తల్లి అంజనాదేవి మాత్రమే పెళ్లికి హాజరు కాలేకపోయారు. మిగిలిన కుటుంబ సభ్యులు మొత్తం ఇటలీకి తరలివచ్చారు. ఇక పెళ్లి వేడుకలలో మెగా వారి బట్టల దగ్గర నుంచి ప్రతిదీ చర్చనీయాంశంగా మారింది. ఇంస్టాగ్రామ్ లో నాగబాబు షేర్ చేసే ఫ్యామిలీ పిక్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఈ నేపథ్యంలో సరికొత్తగా మెగా బ్రదర్ నాగబాబు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసుకోవడమే కాకుండా ఒక ఎమోషనల్ పోస్టు కూడా పెట్టారు. నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో అన్నదమ్ములతో ఉన్న ఫోటోని షేర్ చేసుకున్నాను నాగబాబు.. తన మనసులోని భావనను ఎక్స్ప్రెస్ చేసిన విధానానికి నెటిజెన్లు ఎమోషనల్ అవుతున్నారు. మెగా వారి అనుబంధం అంటే ఇలాగే ఉంటుంది అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

Advertisement

తన అన్న తమ్ముడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన నాగబాబు..”మా మధ్య ఎన్ని విభేదాలు.. వాదనలు వచ్చిన మా బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మేము చేసే పనులు, మా జ్ఞాపకాలు, మా మధ్య విభేదాలు అన్నిటికంటే కూడా మా అనుబంధమే ఎంతో ముఖ్యమైనది.”అని పోస్ట్ చేశారు. అంతేకాదు వాళ్ళ బంధం ఎన్నో పనులు, ప్రేమతో గడిపిన క్షణాల పై ఆధారపడి ఉంటుందట. అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ బంధం నిజంగా ఎంతో విలువైనదిగా తాను భావిస్తున్నట్లు చెప్పారు నాగబాబు. అలాగే తమ అనుబంధం ఎప్పటికీ విడిపోదని.. తమ బంధం పై తమకు అంత నమ్మకం ఉందని నాగబాబు పేర్కొన్నారు.

నాగబాబు చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు..మెగా బ్రదర్స్ మధ్య బంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ అన్నదమ్ములు ఉన్నంత అన్యోన్యతతో రేపటి తరం మెగా వారసులు కూడా ఉండాలి అని ఆశిస్తున్నారు. టాలీవుడ్ సినీ కుటుంబాలలో చిన్న ఫంక్షన్ అయినా సరే.. పండుగ అయినా సరే.. కలిసికట్టుగా ఎప్పుడూ జరుపుకునే కుటుంబం మెగా కుటుంబం. అందుకే టాలీవుడ్ లో చాలామందికి మెగా కుటుంబం అంటే అభిమానం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×