E-Paper
Advertisement

Thandel Movie : నడి సముద్రంలో ‘తండేల్’ షెడ్యూల్.. అంత రిస్క్ అవసరమా చైతూ..

Thandel Movie   : నడి సముద్రంలో ‘తండేల్’ షెడ్యూల్.. అంత రిస్క్ అవసరమా చైతూ..
Advertisement
Thandel Movie Update

Thandel Movie : టాలీవుడ్ లో నటవారసులకు కొదవలేదు. అయితే అక్కినేని కుటుంబం నుంచి లేటెస్ట్ గా వచ్చిన వారసులు ఇద్దరు సరియైన హిట్లు లేక కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రం.. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం.. రెండు భారీ అంచనాల మధ్య విడుదలైన డిజాస్టర్స్ గానే మిగిలాయి. ఇక ఆ తర్వాత అఖిల్ సైలెంట్ అయిపోయిన నాగచైతన్య మాత్రం ఫెయిల్యూర్స్ ని పట్టించుకోకుండా ఎలాగైనా సక్సెస్ సాధించాలి అని తెగ ప్రయత్నిస్తున్నాడు.

రీసెంట్ గా విడుదలైన ‘ధూత’  లో మంచి నటనతో నాగచైతన్య అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా వెబ్ సిరీస్ లో తన సత్తా చాటుకున్నాడు. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ సూపర్ రెస్పాన్స్ సంపాదించి హిట్ గా నిలిచింది.ఇక ప్రస్తుతం అదే జోష్ ను కంటిన్యూ చేస్తూ వచ్చే ఏడాది కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి తెగ కుస్తీ పడుతున్నాడు ఈ కుర్ర హీరో.

Advertisement

చందూ మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య నటిస్తున్న సరికొత్త చిత్రానికి ‘తండేల్’ అనే వెరైటీ పేరు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ సముద్రంలో చేపల వేట చేసే మత్స్యకారుల జీవితానికి సంబంధించిన వాస్తవిక ఘటనలతో ముందుకు సాగుతుంది. శ్రీకాకుళానికి సంబంధించిన మత్స్యకారులు.. చేపల వేట కోసం వెళ్లి ..అనుకోకుండా పాకిస్తాన్ సోల్జర్స్ కి చిక్కడం, ఆ తర్వాత జైలు శిక్ష అనుభవించడం నేపథ్యంలో సాగే రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ తాజాగా ప్రారంభించారు. అయితే ఈ షెడ్యూల్ ప్లానింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా.. నడి సముద్రంలో. వినడానికి గూస్ బంప్స్ తెప్పించే ఈ లొకేషన్ లో నాగచైతన్య ఈ మూవీకి సంబంధించి అతిపెద్ద సాహసం చేయబోతున్నాడు అనిపిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా పోస్టర్ ద్వారా చిత్ర బృందం వెల్లడించారు.ఈ ‘తండేల్’ పోస్టర్‌లో ఎంతో న్యాచురల్ గా నిజమైన మత్స్యకారుడు లుక్ తో ఉన్న నాగచైతన్య చాలా అట్రాక్టివ్ గా ఉన్నాడు. ఈ షెడ్యూల్ కి సంబంధించిన మొత్తం షూటింగ్ నడి సముద్రంలో జరుగుతుంది అన్న విషయాన్ని చిత్ర బృందం వెల్లడించారు. ఈ షెడ్యూల్ లో భాగంగా కొన్ని రిస్క్ షాట్లను నాగచైతన్య స్వయంగా ఎటువంటి డూప్ లేకుండా చేయబోతున్నాడట.

Advertisement

ఈ మూవీలో కొన్ని సాలిడ్ యాక్షన్స్ సన్ని వేశాలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఇందులో హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ఇంతకుముందు నాగచైతన్య ,సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఇక ఆ మూవీలో ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.. దీంతో ఈ పెయిర్ నటిస్తున్న రెండవ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×