E-Paper
Advertisement

Guntur Kaaram : గుంటూరు కారం ప్రీ రిలీజ్ వెన్యూ ఫిక్స్ .. ఇంతకీ ఆ లక్కీ స్పాట్ ఎక్కడో తెలుసా?

Guntur Kaaram : గుంటూరు కారం ప్రీ రిలీజ్ వెన్యూ ఫిక్స్ .. ఇంతకీ ఆ లక్కీ స్పాట్ ఎక్కడో తెలుసా?
Advertisement
Guntur Kaaram

Guntur Kaaram : క్రిస్మస్ పూర్తయింది ఇక త్వరలోనే 2023 సంవత్సరం కంప్లీట్ అవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యి అవ్వకముందే సంక్రాంతి సినిమాల హడావిడి షురూ అవుతుంది. మరి ముఖ్యంగా జనవరి 12న పండుగ బరిలో దిగబోతున్న గుంటూరు కారం మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు మూవీ నుంచి విడుదలైన పాటలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. పైగా ఈ చిత్రంలో మహేష్ బాబుని మునిపెన్నడూ చూడనంత మాస్ యాంగిల్ లో చూడొచ్చు అని అందరూ భావిస్తున్నారు.

ప్రస్తుతం చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు సినిమా అంటే ప్రమోషన్స్ తో పాటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కంపల్సరిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుంది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 27 లోపల పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక ఈ షూటింగ్ పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్తారు.

Advertisement

మరోపక్క షూటింగ్ పూర్తి అయిన వెంటనే కచ్చితంగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టాలి లేకపోతే సమయం సరిపోదు. వారం రోజులపాటు కొనసాగే మహేష్ బాబు ట్రిప్ పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చిన వెంటనే గుంటూరు కారం మూవీకి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈలోపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన సన్నాహాలు మొదలు పెడుతున్నారు చిత్ర బృందం. ఇంతకీ ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?

మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎప్పుడో తెలుసా? అని అడుగుతారు.. అదేంటి వెరైటీగా ఎక్కడో తెలుసా? అంటున్నాను అని అనుకుంటున్నారా.. అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. సినీ ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు ఉండడం సహజం.. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సంబంధించి ఓ చిన్న సెంటిమెంట్ ఉంది. త్రివిక్రమ్ ,అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలవైకుంఠపురం సినిమా ఎన్ని రికార్డులు తిరగరాసిందో మనందరికీ తెలుసు. ఇది బన్నీ కెరీర్ లో కూడా ఓ మైలురాయిగా మిగిలిపోయిన చిత్రం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ప్రస్తుతం గురూజీ ఆ ప్లేస్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సెంటిమెంట్ స్పాట్ గా ఫీల్ అవుతున్నారట. అందుకే గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి డేట్ విషయంపై ఇంకా చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. న్యూ ఇయర్ లోపు ఆ న్యూస్ అందుతుందని ఆశిద్దాం..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×