Sai Durga Tej: మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ (Sai Dharam Tej) రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ నుండి బయటపడి ఇప్పుడిప్పుడే సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన పేరును సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) గా మార్చుకున్న విషయం తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత కోలుకొని బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచిన ఈయన.. ఆ తర్వాత విరూపాక్ష సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయనతో నటించిన ఒక హీరోయిన్ రహస్యంగా వివాహం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వివాహం చేసుకున్న కళ్యాణి ప్రియదర్శన్..
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన హలో (Hello ) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani priyadarshan).. ఆ తర్వాత మెగా హీరో సాయి దుర్గా తేజ్ తో చిత్రాలహరి (Chitralahari )అనే సినిమా చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. వాస్తవానికి తెలుగులో ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా ఈ అమ్మడి కి మాత్రం తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చేరువలో ఉండే ఈమె తాజాగా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు తనకు పెళ్లి జరిగినట్టు ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
సీరియల్ యాక్టర్ తో వివాహం..
ఈ ఫోటోలు, వీడియోలు చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది ఇంత సడన్గా వివాహం చేసుకున్నావేమిటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె శ్రీరామ్ కస్తూరిమాన్ (Sriram kasthuriman)అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతడు కూడా యాక్టరే కావడం గమనార్హం. బుల్లితెర సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శ్రీరామ్ కూడా తన పెళ్లి వీడియోని షేర్ చేస్తూ.. “అవును ఈ క్షణాలు మమ్మల్ని మరింత ఆనందపరుస్తాయి” అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో అభిమానులు డైలమాలో పడిపోయారు. దీనికి తోడుఇక్కడ వీరిద్దరి తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఇది నిజమైన పెళ్లా లేక యాడ్ షూటా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
క్లారిటీ ఇచ్చిన వరుడు..
అసలు విషయంలోకి వెళితే..ఇది యాడ్ షూట్ అని తెలుస్తోంది. శ్రీరామ్ కు ఇదివరకే వందిత(Vandita ) అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ తో పెళ్లి చేసుకున్న వీడియోని శ్రీరామ్ షేర్ చేయడంతో అందరూ డైలమాలో పడిపోయారు. వరుస పోస్ట్లు పెట్టి నిజంగానే పెళ్లి చేసుకున్నారా..? మీ భార్య వందితతో విభేదాలు వచ్చాయా? ఆమెకు విడాకులు ఇచ్చి ఈమెను వివాహం చేసుకున్నారా? అంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయనే అసలు విషయం చెప్పారు. ఒక యాడ్ కోసమే ఇలా పెళ్లి చేసుకున్నట్లు నటించామని, ఇది నిజంగా తనకు కళ్యాణికి జరిగిన వివాహం కాదని తెలిపారు. మొత్తానికైతే ఎస్ భారత్ వెడ్డింగ్ కలెక్షన్ ప్రమోషన్ లో భాగంగా ఈ వీడియో షూట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">