E-Paper
Advertisement

Venu Swamy: బ్రేకింగ్.. వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు..

Venu Swamy: బ్రేకింగ్.. వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు..
Advertisement

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వివాదం రోజురోజుకు ముదురుతోంది. వేణుస్వామి ఈమధ్యనే నాగ చైతన్య, శోభితల జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. వారు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్ మెంట్ చేసుకుంటే.. వేణుస్వామి వారి జాతకాల్లో కలిసి ఉండే యోగం లేదని, మరో అమ్మాయి వలన ఈ జంట విడిపోతారని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.

అంతేకాకుండా చైకు పిల్లలు పుట్టరని, సమంత జాతకం కన్నా, శోభితా జాతకం చాలా దరిద్రంగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో మీడియాలోని ఓ వర్గం వేణుస్వామి మీద మహిళా కమిషన్‌‌కు ఫిర్యాదు చేసింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ లోని కొందరు జర్నలిస్టులు.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారదను కలుసుకొని వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు. ఇలాంటివారిని ఊరికే వదలకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఇక దీంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారద.. వేణుస్వామికి నోటీసులు పంపారు. ఈ వివాదంపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారద స్పందిస్తూ.. వేణుస్వామిని ఆగస్టు 22 న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీచేశారు. ఇందుకు సంబంధించిన నోటిస్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇకపోతే ఇప్పటికే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చెప్పడం వలన తాను ఇలాంటి సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని వీడియో రిలీజ్ చేశాడు వేణుస్వామి. మరి ఈ విచారణలో వేణుస్వామి అదే మాట చెప్తాడా.. ? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×