BigTV English

Naga Chaitanya: టాటూపై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన చైతూ.. సమంత గుర్తుకొస్తోంది అంటూ..?

Naga Chaitanya: టాటూపై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన చైతూ.. సమంత గుర్తుకొస్తోంది అంటూ..?

Naga Chaitanya.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య (Naga Chaitanya) జోష్ (Josh) సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోకపోయినా నాగచైతన్యకి మాత్రం బెస్ట్ డెబ్యూ అవార్డు లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమాలో హీరోయిన్ సమంత (Samantha) సరసన నటించి మంచి ఇమేజ్ దక్కించుకున్నారు. అంతేకాదు అదే సమయంలో ఆమెతో ప్రేమలో పడి దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించిన గొడవలు వచ్చి వైవాహిక బంధం లో నాలుగు సంవత్సరాలకే దూరం అవడం నిజంగా బాధాకరమని చెప్పాలి.


చైతూ జ్ఞాపకాలను తుడిచేసిన సమంత..

నిజానికి పెళ్లి తర్వాత నటన కొనసాగించింది సమంత. ఆమేరకు ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చూసి చాలామంది ముచ్చట పడ్డారు. కానీ సడన్ గా విడిపోతున్నామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. నాలుగేళ్ల పాటు సాగిన వైవాహిక జీవితానికి ఎండ్ కార్డు వేసింది ఈ జంట. అయితే అప్పటికే నాగచైతన్య గుర్తుగా తన రిబ్స్ పైన సమంత టాటూ వేయించుకుంది. ఇటు చైతన్య కూడా కుడి చేతి పైన తమ పెళ్లిరోజును సూచించేలా ఇంకో టాటూ కూడా వేయించుకున్నాడు. అయితే విడాకులు తర్వాత కష్టపడి సమంత ఆ పచ్చబొట్టు ను శాశ్వతంగా తొలగించుకోవడంతో చైతూ జ్ఞాపకాలను కూడా తుడిచేసింది అంటూ అభిమానులు కామెంట్లు చేశారు.


Naga Chaitanya: Chaithu who gave a dizzying twist on the tattoo.. Samantha remembers him..?
Naga Chaitanya: Chaithu who gave a dizzying twist on the tattoo.. Samantha remembers him..?

సమంతను మర్చిపోలేకపోతున్న చైతూ..

ఇదిలా ఉండగా మరొకవైపు నాగచైతన్య ఇంకో పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రముఖ నటి శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) తో డేటింగ్ చేసిన ఈయన ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇప్పుడు కొత్త భార్య వస్తుంది కాబట్టి ఆ పెళ్లినాటి జ్ఞాపకం ఉన్న టాటూ సంగతి ఏంటి అంటూ మీడియా ప్రశ్నించగా.. నాగచైతన్య అది తొలగించను అని చెప్పినట్లు సమాచారం. దీంతో వచ్చిన సమస్య ఏం లేదు కదా.. అది అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సమంతాను ఇంకా మరిచిపోలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెండో పెళ్లి తర్వాత కూడా మొదటి పెళ్లి తాలూకా గుర్తును తనతో పాటే ఉంచుకున్నాడు అంటే ఇండైరెక్టుగా అది సమంత జ్ఞాపకమే కదా .. దీని వెనుక ఇంకా ఏదైనా మ్యాటర్ ఉందా అనే కోణంలో నెటిజన్లు ఆరా తీస్తూ ఉండడం గమనార్హం. మరికొంతమంది కొత్త పెళ్ళాం ఈ విషయంలో ఏదైనా పేచీ పెడితే అప్పుడు అయ్యగారి పరిస్థితి ఏంటి..? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి పెళ్లి తర్వాత శోభిత ఒకవేళ ఒత్తిడి చేస్తే తీసేస్తాడా లేక అలాగే ఉంచుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×