The Rana Daggubati Show : టాలీవుడ్ మాజీ కపుల్ నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) విడాకుల విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. వాళ్ళు విడిపోతున్నాం అని ప్రకటించగానే ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. అందులో వీళ్ళిద్దరి మధ్య పిల్లల గురించి జరిగిన వివాదమే విడాకులకు కారణమైందనే టాక్ కూడా నడిచింది. కానీ తాజాగా ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show)లో నాగ చైతన్య పిల్లలు కావాలని ఉందంటూ చేసిన కామెంట్స్ తో, గతంలో సమంత విషయంలో వచ్చిన వార్తలన్నీ పుకార్లేనా ? అనే అనుమానాలు మొదలవుతున్నాయి.
రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show). ఇందులో మొదటి ఎపిసోడ్ నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో నాని, రాజమౌళి, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, ప్రియాంక మోహన్ తదితరులు పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అందులో నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రానా ‘నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు?’ అని నాగ చైతన్యను ప్రశ్నించాడు. దానికి చై స్పందిస్తూ ‘సంతోషంగా పెళ్లి చేసుకుని… కొంతమంది పిల్లలు’ అని బదిలిచ్చారు.
అయితే గతంలో నాగ చైతన్య (Naga Chaitanya), సమంత విడాకులు తీసుకున్న టైంలో సమంత పిల్లల్ని వద్దనుకుందని, అబార్షన్ చేయించుకుందని టాక్ నడిచింది. దానిపై సమంత స్పందించింది. కానీ ఆ రూమర్లపై క్లారిటీ ఇవ్వలేదు. ‘ఇలాంటి రూమర్లను ఎప్పటికీ సహించబోను’ అంటూ వార్నింగ్ మాత్రం ఇచ్చింది. అయితే అప్పట్లో మాధవీలత మాట్లాడుతూ సమంతను ఒక డబ్బులు తెచ్చే మెషిన్ లా చూశారు తప్ప, మనిషిలా చూడలేదని అన్నారు. పైగా 30 ఏళ్లలోపే పిల్లల్ని కనాలని ఉందని సమంత చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పిల్లల విషయం పక్కన పెట్టి, ఆమెను సినిమాలకు మాత్రమే వాడుకొని, తన ఆశలు చంపేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక రీసెంట్ గా సమంత ఆంగ్ల మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను తల్లి కావాలని కోరికను వ్యక్తం చేసింది. ఇక తాజాగా శోభిత ధూళిపాళ్ల (Sobhitha Dhulipala)ను రెండో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో నాగ చైతన్య ఇలాంటి కామెంట్స్ చేయడం సంచనంగా మారింది. వీళ్ళు ఇద్దరూ ఇలా పిల్లలు కావాలి అని అనుకుంటే, కచ్చితంగా గతంలో వచ్చిన వార్తలన్నీ రూమర్లే అన్న విషయం స్పష్టమైనట్టే.
కాగా నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల ఈ డిసెంబర్ లో, అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకోబోతున్నారు అని టాక్ నడుస్తోంది. దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ఇప్పటికైతే నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు సమంత ‘ సిటాడెల్ : హనీ బన్నీ’ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది.