Naga Chaitanya..ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు సినిమాలలో సక్సెస్ అవుతూనే.. మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఇంకొకరు తమకు నచ్చిన రంగంలో సెటిల్ కావాలని, ఇప్పటినుంచే ప్రణాళికలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కూడా తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నాగచైతన్య చివరిగా ‘తండేల్’ సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో మంచి సక్సెస్ జోష్లో ఉన్నారు నాగచైతన్య. దీనికి తోడు ప్రస్తుతం నాగచైతన్య ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు. మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి.
తండ్రి బాటలో నాగచైతన్య..
ఇకపోతే ఈ సినిమాల విషయం పక్కన పెడితే.. ఈమధ్య కాలంలో చాలామంది సినీ తారలు అటు సినిమాలతో పాటు ఇటు వ్యాపారాలలో కూడా సక్సెస్ అవుతూ.. రెండు చేతుల బాగా సంపాదిస్తున్నారు. అలా టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న నాగార్జున (Nagarjuna ) కూడా అటు అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ఇటు ఎన్- కన్వెన్షన్ అలాగే ఎన్నో వ్యాపారాలు కూడా చూసుకుంటున్నారు. అంతేకాదు మరికొన్ని సంస్థలలో ఆయన పెట్టుబడులు కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన బాటలోనే నాగచైతన్య కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. నాగచైతన్య ఇదివరకే పలు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా రీసెంట్గా తన భార్య శోభిత (Shobhita) సహకారంతో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘షుజి’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచులు అన్నింటిని ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఈ ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా సినిమాల నుండి రిటైర్డ్ అయిన తర్వాత చెఫ్ గా మారాలి అని ఎన్నో కలలు కన్నారు నాగచైతన్య. అందులో భాగంగానే ఇప్పుడు తన ప్రయత్నంలో భాగంగా తొలిమెట్టు ఎక్కేసారు. మరి ఈ ప్రయత్నానికి నాగచైతన్య భార్య శోభిత ఫుల్ సపోర్ట్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. “మా ప్రయత్నానికి అభిమానుల ఆదరణ ,ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాము” అంటూ ఒక పోస్ట్ షేర్ చేసిన నాగచైతన్య అందులో భాగంగానే కిచెన్ తో పాటూ అక్కడ పలు వంటకాలు తయారు చేస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నాగచైతన్య బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు ఇక్కడ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే నాగచైతన్య.. శోభితను వివాహం చేసుకున్న తర్వాతే బాగా కలిసి వచ్చిందని, అటు సినిమాలలో వరుసగా సక్సెస్ లు అందుకుంటూ.. మరొకవైపు తన డ్రీమ్ కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే చెఫ్ గా తన అభిరుచులు చాటుకుంటున్న నాగచైతన్య ఈ రంగంలో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు..