ISRO Recruitment: ఇస్రోలో పనిచేయాలనే నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. బీఈ/ బీటెక్, ఎంఎల్‌ఐఎస్సీ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులై అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం అనే చెప్పవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
బెంగళూరు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)- 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, డిప్లొమా అండ్ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 21వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 75
బెంగళూరు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)లో పలు రకాల అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్ ట్రైనింగ్/ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 46
డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్/ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్: 15
ట్రేడ్ అప్రెంటిస్: 14
గ్రాడ్యుయేట్ విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, లైబ్రరీ సైన్స్.
డిప్లొమా విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కమర్షియల్ ప్రాక్టీస్.
ట్రేడ్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్.
రీజియన్లు: సదరన్ రీజియన్, నర్తన్ రీజియన్, ఈస్ట్రన్ రీజియన్
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 21
విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎల్‌ఐఎస్సీ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ పాసై ఉండాలి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు విధానం: ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ లో ఇచ్చిన సంబంధిత రీజియన్ ఈ మెయిల్ ఐడీకి ఏప్రిల్ 24 న దరఖాస్తు పంపించాలి.
ఉద్యోగ ఎంపిక ప్ర్రక్రియ: దరఖాస్తు స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
స్టైఫండ్: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు. నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు.
ఇంటర్వ్యూ డేట్స్: ఏప్రిల్ 29, 30, మే14, 15, 20, 21.
వేదిక:
*ఐఎస్‌టీఆర్‌ఏసీ బెంగళూరు ప్లాట్ 12 అండ్ 13, 3వ మెయిన్, రెండో ఫేస్, పీన్య ఇండస్ట్రియల్ ఏరియా, బెంగళూరు.
*ఐఎస్‌టీఆర్‌ఏసీ లఖ్‌నవూ సెక్టార్-జి, జానకిపురం, కుర్సిరోడ్, లక్నో
*ఐఎస్‌టీఆర్‌ఏసీ, శ్రీ విజయపురం డోలిగుంజ్, శ్రీ విజయపురం, అండమాన్ అండ్ నికోబార్ ఐస్‌ల్యాండ్స్.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 75
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 21
ఇది కూడా చదవండి: Jobs: టెన్త్ క్లాస్‌తో భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఆలస్యం వద్దు.. ఇంకా ఐదు రోజులే గడువు మిత్రమా..!
ఇది కూడా చదవండి: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..