Online Games : ఆన్‌లైన్ గేమ్స్. సొసైటీకి చీడ పురుగుగా మారింది. పిల్లలు, యువకులు, పెద్దలు.. వాళ్లూ వీళ్లు అనే తేడా లేదు. చేతిలో మొబైల్, నెట్ కనెక్షన్ ఉంటే చాలు. రాత్రింబగలు ఆటలే. రకరకాల పేర్లు. ట్రెజర్ హంట్లు, పబ్జీలు, ఫైరింగ్‌లు, రేసింగ్‌లు. టార్గెట్లు. క్రెడిట్లు. ఆడుతుంటే కిక్‌గా ఫీల్ అవుతున్నారు. మొదట్లో నిమిషాలతో మొదలవుతుంది ఆ ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం. ఆ తర్వాత గంటల తరబడి ఆడాల్సిందే. కొందరైతే రెండు మూడు రోజుల పాటు లేవకుండా ఆడుతూనే ఉంటారు. చేతులు, నడుములు నొప్పు పుట్టినా.. మెడ లాగేస్తున్నా.. కళ్లు పీకేస్తున్నా.. నిద్ర కరువవుతున్నా.. ఆకలి దంచేస్తున్నా.. గేమ్ నుంచి మాత్రం బయటకు రారు. అంతలా అడిక్ట్ పోతున్నారు ఈ ఆన్‌లైన్ వ్యసనానికి. గేమ్ ఆడీఆడీ ఆసుపత్రి పాలైన ఘటనలు రెగ్యులర్‌గా న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. కొందరు పేరెంట్స్ తమ పిల్లలను కంట్రోల్ చేయడానికి.. సెల్‌ఫోన్స్ లాగేసుకుంటే.. హర్ట్ అయి సూసైడ్ చేసుకున్న వారు కూడా చాలామందే ఉంటారు. ఇలా ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం సమాజాన్ని పట్టి కుదిపేస్తుంటే.. లేటెస్ట్‌గా మద్రాసు హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. కోర్టులో ఆన్‌లైన్ గేమర్స్ అసోసియేషన్ వాదన రచ్చ రాజేస్తోంది.
ఆన్‌లైన్ గేమ్స్‌కు తమిళనాడు సర్కార్ కండీషన్స్
ఆన్‌లైన్ గేమ్‌ల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మిడ్‌నైట్ 12 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు తమిళనాడులో ఆన్‌లైన్ గేమ్‌ల ప్లాట్‌ఫామ్స్ బంద్ చేసింది. యాప్స్‌లో లాగిన్ కావడానికి KYC తప్పనిసరి చేసింది. ఆధార్ ఎంటర్ చేస్తేనే ఎంట్రీ. ఈ నిబంధనలతో గేమర్స్ మైండ్ బ్లాక్ అయినంత పనైంది. ఇలాంటి రూల్స్‌ను తాము ఒప్పుకోమంటూ.. ఆన్‌లైన్ గేమర్స్ సంక్షేమ సంఘం ఒకటి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి.
కోర్టులో లా పాయింట్స్.. గేమర్స్‌కే అడ్వాంటేజ్?
ఒక గేమర్ ఏ టైమ్‌లో గేమ్ ఆడాలో అతనే డిసైడ్ చేసుకుంటాడు కానీ, ఫలానా టైమ్‌లో మాత్రమే గేమ్ ఆడాలంటూ గవర్నమెంట్ ఎలా చెబుతుందనేది వారి వాదన. ఒక మేజర్ తన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే అది అతని ఇష్టం.. అంతేకానీ, అతను ఎలా జీవితాన్ని గడపాలో చెప్పడానికి సర్కారుకు ఏం హక్కు ఉందంటూ ఆన్‌లైన్ గేమర్స్ అసోసియేషన్ వాదించింది. ఒకరు ఎక్కువ సేపు గేమ్ ఆడుతున్నారని కానీ, ఆ ఆటకు బానిస అవుతున్నారని కానీ.. ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం నిర్ణయిస్తుందని తప్పుబట్టారు. ఆన్‌లైన్ గేమింగ్‌ను కంట్రోల్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవర్ లేదని సీనియర్ లాయర్ సుందరం వాదించారు. ఆన్‌లైన్ గేమ్‌లను స్కిల్ పెంచే ఆటలుగా చూడాలి కానీ.. వాటిని కమర్షియల్ కోణంలో చూస్తూ సర్కారు నియంత్రించడం సరికాదని అన్నారు.
Also Read : లవ్ చేసి.. 6 కోట్లు కొట్టేసి.. డేంజరస్ డేటింగ్ యాప్స్
గేమింగ్.. గ్యాంబ్లింగ్?
గేమింగ్ సేవలను అందించే ప్లాట్‌ఫాంలు డబ్బు వసూలు చేస్తున్నా.. ఆ గేమ్స్‌ను ఆడే వాళ్లు మాత్రం ఎలాంటి కమర్షియల్ బిజినెస్‌లో పార్టిసిపేట్ చేయరని గేమర్స్ తరఫు లాయర్ చెప్పారు. ఒక వ్యక్తి ఆరోగ్యానికి ఏది మంచిదో స్టేట్ డిసైడ్ చేయలేదని.. ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రం ఆంక్షలు విధించవచ్చని అన్నారు. ఆన్‌లైన్ గేమింగ్ అనేది ఒక వ్యసనంగా మారినప్పటికినీ.. ఆట ఆడటం అనేది ఒక వ్యక్తి హక్కు అని.. వారు దానికి బానిసలు అవుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పారు. 18 ఏళ్లు నిండిన వారు ఏం చేయాలో.. ఏం చేయకూడదో గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదని కోర్టులో గట్టిగా వాదించింది ఆన్‌లైన్ గేమర్స్ అసోసియేషన్.