E-Paper
Advertisement

NC23 Title : నిజజీవిత కథ ఆధారంగా NC23.. టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్

NC23 Title : నిజజీవిత కథ ఆధారంగా NC23.. టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్
Advertisement

NC23 Title : టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. చాలాకాలం తర్వాత వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. వచ్చే నెల ధూతగా అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్ విడుదలవుతుండగా.. తాజాగా నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దూకుడు పెంచాడు. నాగచైతన్య తన 23వ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి మరోసారి చైతన్య సరసన నటిస్తోంది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 2018లో జరిగిన నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఈ సినిమా కోసం చైతూ.. ప్రత్యేకంగా జిమ్ ట్రైనింగ్ తీసుకుంటూ బాడీ పెంచుతున్నాడు. 2018లో గుజరాత్ నుంచి 21 మంది మత్స్యకారులు వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ చెరలో చిక్కుకోగా.. వారిలో ఉన్న ఓ ఆంధ్రామత్స్యకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ఇటీవలే నిర్మాతలు వెల్లడించారు. సినిమా రీసెర్చ్ కోసం నాగచైతన్య శ్రీకాకుళంలో మత్స్యకారులతో సముద్రంలోకి కూడా వెళ్లొచ్చాడు. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే ను పురస్కరించుకుని.. బుధవారం సినిమా టైటిల్ ను ప్రకటించారు.

Advertisement

ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్ ను పెట్టినట్లు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చైతూ.. సముద్రంలో ఉన్న ఒక పడవలో కూర్చొని సీరియస్ లుక్ లో.. ఫుల్ గడ్డంతో పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే ఇది చైతూకి మంచి హిట్ ఇచ్చే సినిమా లాగే కనిపిస్తోంది.

NC23 Title

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×