BigTV English

Vishwak Sen : RX100కు వెళ్లాల్సింది కానీ.. అప్పుడలా జరగడంతో హిట్ మిస్సైందన్న విశ్వక్

Vishwak Sen : RX100కు వెళ్లాల్సింది కానీ.. అప్పుడలా జరగడంతో హిట్ మిస్సైందన్న విశ్వక్
Vishwak Sen

Vishwak Sen : టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. హీరోగా సక్సెస్ అందుకున్న నటులలో విశ్వక్ సేన్ ఒకడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి.. వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఈ నగరానికి ఏమైందితో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్, ఓరి దేవుడా, అశోకవనంలో అర్జున కల్యాణం, దాస్ కా ధమ్కీ సినిమాలతో వరుస హిట్లు అందుకుని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. విశ్వక్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్న విశ్వక్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.


తాజాగా జరిగిన మంగళవారం సక్సెస్ మీట్ కు గెస్ట్ వచ్చిన విశ్వక్.. అజయ్ భూపతి దర్శకత్వంలో మిస్సైన సినిమాల గురించి మాట్లాడాడు. ముందుగా హిట్ కొట్టిన మూవీ టీమ్ కు అభినందనలు తెలిపాడు. అనంతరం మాట్లాడుతూ.. RX100 సినిమాకు ఫొటోలు పంపమని డైరెక్టర్ అజయ్ భూపతి అడిగినపుడు కుదర్లేదన్నాడు. ఆ సమయంలోనే ఈ నగరానికి ఏమైంది సినిమాలో సెలెక్ట్ అవ్వడంతో ఫొటోలు పంపలేదన్నాడు.

ఆ తర్వాత మహాసముద్రం స్టోరీ కూడా విన్నానని, అప్పుడు కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వక సినిమా చేయలేదని తెలిపాడు. డేట్స్ లేకపోవడంతో విశ్వక్ ఆ రెండు సినిమాలను మిస్ అయినట్టు తెలుస్తోంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×