E-Paper
Advertisement

Congress Meeting Nizamabad Rural : కేసీఆర్ గుర్తుంచుకో.. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే : రేవంత్ రెడ్డి

Congress Meeting Nizamabad Rural : కేసీఆర్ గుర్తుంచుకో.. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే : రేవంత్ రెడ్డి

Congress Meeting Nizamabad Rural : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. తెలంగాణలో బారాబర్ ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. కేసీఆర్ గుర్తుంచుకో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని తేల్చిచెప్పారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు 10 ఏళ్లు అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే బాధ్యత కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు 80కి తగ్గకుండా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.

నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పై రేవంత్ విమర్శలు గుప్పించారు. ఆయన వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. కానీ రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. కవితను ఓడించినప్పటి నుంచి నిజామాబాద్ పై కేసీఆర్ కక్ష పెంచుకున్నారని విమర్శించారు.

నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులకు దేశంలో ప్రత్యేక పేరుందన్నారు రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ సర్కార్ వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, మహిళల కోసం ప్రవేశపెట్టే పథకాలను వివరించారు. పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలు రూ. 2500 ఆర్థికసాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, రైతులకు రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని ప్రకటించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ లో రేకులపల్లి భూపతిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత రెడ్డి పిలుపునిచ్చారు.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×