E-Paper
Advertisement

Naga Chaitanya : నాగ చైతన్య బర్త్ డే ట్రీట్.. ధూత నుంచి క్రేజీ అప్డేట్..

Naga Chaitanya : నాగ చైతన్య బర్త్ డే ట్రీట్.. ధూత నుంచి క్రేజీ అప్డేట్..
Advertisement
Naga Chaitanya latest news

Naga Chaitanya latest news(Tollywood news in telugu):

కస్టడీ మూవీ తర్వాత నాగచైతన్య మరో మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం NC23 గానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. చందు మొండేటి డైరెక్షన్ లో తరికెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో విడుదల అవుతుంది. ఈ హై యాక్షన్ మూవీ శ్రీకాకుళంలో మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. అక్కడి మత్స్యకారుల నిజ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. డాక్టర్ యాక్టర్ సాయి పల్లవి మరోసారి నాగచైతన్య తో జతకట్టనుందని తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతం నాగచైతన్య స్పై ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా తో ఓటీటీపై ప్రత్యక్షం కాబోతున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్లు ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ లతో జోరు పెంచిన సంగతి తెలిసిందే. వెంకటేష్ దగ్గర నుంచి తమన్నా వరకు.. చాలామంది హీరో, హీరోయిన్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కూడా వారి అడుగుజాడల్లోనే నడవడానికి ప్రయత్నిస్తున్నాడు.

 సినిమాల తో పాటు ఆన్లైన్లో కూడా తన లక్ ను పరీక్షించుకునేందుకు చైతూ.. ధూత అనే వెబ్ సిరీస్ తో డిసెంబర్ 1 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ వివిధ భారతీయ భాషలలో ప్రదర్శించబడుతుంది. నవంబర్ 21న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ధూత మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు టాక్. అయితే ఇంకా ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement

శరత్ మరార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్,ప్రాచీ దేశాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని అక్కినేని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×