BigTV English

Naga Chaitanya : ధూత డేట్ ఫిక్స్.. ఆసక్తి రేపుతున్న పోస్టర్..

Naga Chaitanya : ధూత డేట్ ఫిక్స్.. ఆసక్తి రేపుతున్న పోస్టర్..
Naga Chaitanya

Naga Chaitanya : అక్కినేని నాగార్జున నట వారసుడిగా మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. జోష్ మూవీ తో ఫుల్ జోష్ లో బరిలోకి దిగిన ఈ హీరో తన వైవిధ్యమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. పలు చిత్రాలలో నటించినప్పటికీ అతని కెరియర్ లో ఇప్పటి వరకు మంచి రేంజ్ బ్లాక్ బస్టర్ చిత్రం లేకపోవడం అక్కినేని అభిమానులకు ఇప్పటికీ కొరతే. అయినా కానీ శక్తివంచన లేకుండా మంచి సినిమాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు నాగచైతన్య.


ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నాగచైతన్య తన లక్ వెబ్ సిరీస్ లో కూడా ప్రయత్నించబోతున్నాడు. ధూత అనే స్పై వెబ్ సిరీస్ తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తనదైన నటనతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ముందుకు సాగుతున్న నాగచైతన్య వెబ్ సిరీస్ లో కూడా తన సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే ఈ కుర్ర హీరో వెబ్ సిరీస్ తో ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి. ధూత వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ కాబోతోంది. మంచి స్పై జోనర్ లో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?


ఓటిటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధూత వెబ్ సిరీస్ గత ఆగస్టులో స్ట్రీమింగ్ అవుతుంది అన్న ప్రచారం జరిగినప్పటికీ.. అలా జరగలేదు. దీంతో అసలు ఈ వెబ్ సిరీస్ వస్తుందా రాదా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే అనుమానాలన్నిటిని పటాపంచలు చేస్తూ.. డిసెంబర్ 1 వ తేదీ నుంచి నాగచైతన్య ధూత స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అమెజాన్ సంస్థ తాజాగా వెల్లడించింది.

 డేట్ అనౌన్స్మెంట్ ను ఒక పోస్టర్ ద్వారా తెలియపరిచారు మేకర్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టర్ సిరీస్ పై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. సీరియస్ లుక్ తో ఉన్న నాగచైతన్య తో పాటుగా వెనుక బ్యాక్ గ్రౌండ్ లో ఒక కథను అక్షర రూపంలో పెట్టారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. విడుదల అయిన తరువాత మరి పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×