Naga Chaithanya : ప్రస్తుతం ఎక్కడ విన్నా అక్కినేని నాగ చైతన్య పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. డిసెంబర్ 4 ఆయన హీరోయిన్ శోభిత దూళిపాలతో రెండో పెళ్లి చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వీరి వివాహం జరిగింది.. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న కొత్త జంట శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఇక చైతూ- శోభిత హనీమూన్ కు ఎక్కడికి వెళ్తారో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. కానీ చైతన్య మరికొద్ది రోజుల్లో భార్యకు దూరంగా వెళ్లబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. అదేంటి పెళ్ళై పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే ఎందుకు? అసలేమైంది? అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నట్లు తెలుస్తుంది. అందుకు కారణం ఉందని తెలుస్తుంది. అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నాగచైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన సినిమా `తండేల్`. చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 20 న రిలీజ్ చేస్తామని మేకర్స్ అన్నారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు ఆంధ్రా మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మత్స్యకారులు పాకిస్తాన్ జలాల్లో చిక్కుకుంటారు.. పాకిస్తానీ ఆర్మీ జైలులో వేస్తుంది. అయితే వారిని చివరికి విడుదల చేసారా లేదా? ఈ పోరాటంలో ప్రేమికుడైన నాగచైతన్య జీవితం ఎలా సాగింది? ఎడబాటులో ఉన్న సాయి పల్లవి, నాగ చైతన్య ఒకరి కోసం మరొకరు ఎదురు చూస్తూ బ్రతికేస్తారు. చివరికి వీరిద్దరూ కలుసుకున్నారా? లేదా అన్నది సినిమా స్టోరీ.
ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ను వేగవంతంగా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఈనెల 11 నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. నాగచైతన్య- శోభిత ధూళిపాల పెళ్లి సందర్భంగా చిన్న గ్యాప్ తీసుకున్న టీమ్ తిరిగి చిత్రీకరణకు రెడీ అవుతోంది. చైతూ సెట్స్ కి వస్తాడని టాక్.. అయితే పెళ్ళైన వారం రోజుల లోపే భార్యకు దూరంగా వెళ్లడం కష్టం కదా అని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.. ఏడు రోజులు షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ అయ్యాక న్యూయర్ కోసం సెలవులు తీసుకోబోతున్నాడని సమాచారం. ఇకపోతే తండేల్ ఫైనల్ ఔట్ పుట్ పై నిర్మాతలు సంతృప్తికరంగా ఉన్నారని సమాచారం. సినిమా బాగా వచ్చింది.. క్లైమాక్స్, చందూ టేకింగ్ చాలా బాగా నచ్చిందని సమాచారం… సినిమా రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.. ఈ సినిమా పై నాగ చైతన్య ఆశలు పెట్టుకున్నాడు. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి వరుసగా హిట్ సినిమాలు పలకరించాయి.. శోభిత అడుగు పెట్టాక ఎలా మారుతుందో చూడాలి..