Bad Weather: శీతాకాలం వచ్చిందంటే ప్రయాణాలు చేయడం కష్టంగా మారుతోంది. బస్సు, రైలు, విమానం ఇలా ఏది చూసినా ఒక్కటే సమస్య. దట్టమైన పొగ మంచు కారణంగా రూటు క్లియర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి. లేటెస్ట్‌గా అలాంటి వ్యవహారం వెలుగు చూసింది. షార్జా నుంచి గన్నవరం రావాల్సిన విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది.
శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలముకుంది. దీని కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ఏం జరుగుతుందో తెలీక ప్రయాణీకులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. చివరకు హైదరాబాద్‌లో ల్యాండింగ్ అయ్యాయి.
షార్జా, ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన విమానాలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో వాతావరణ అనుకూలించకపోవడంతో కాసేపు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. బెంగళూరు, మద్రాస్ నుంచి రావాల్సిన విమానాలు ఉదయం 7:30 గంటలకు గన్నవరంలో ల్యాండింగ్ కావాలి. పొగమంచు కారణంగా ల్యాండింగ్ సమస్య ఏర్పడింది.
వాతావరణం అనుకూలించిన వెంటనే పర్మీషన్ ఇస్తామని అధికారులు చెప్పుడంతో కాసేపు విమానాలు గాల్లోనే ఉన్నాయి. చివరకు వాతావరణం అనుకూలించిన వెంటనే విమానాలు ఒకొక్కటిగా ల్యాండింగ్ అవుతున్నాయి. అంతకుముందు అంటే ఎర్లీ మార్నింగ్ ఐదు నుంచి ఆరు గంటల మధ్య వాతావరణ అనుకూలించలేదు. దీంతో పలు విమానాలు హైదరాబాద్‌లో ల్యాండ్ అయినట్టు సమాచారం.
ALSO READ: జగన్‌ను ఇరికిస్తున్న విజయసాయిరెడ్డి.. జనసేనలోకి రూట్ క్లియర్!
ఇదిలా వుండగా విశాఖ విమానాశ్రయం వద్ద శనివారం ఉదయం దట్టమైన పొగ మంచు ఆవరించింది. దీంతో పలు విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీ-విశాఖ విమానాన్ని భువనేశ్వర్ వైపు, హైదరాబాద్-విశాఖ, బెంగళూరు-విశాఖ విమానాలు హైదరాబాద్ వైపు మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. ప్రయాణికులకు సమాచారం అందించినట్లు వివరించారు.