Pink Ball vs Red Ball: టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) జట్ల మధ్య ప్రస్తుతం పింక్ బాల్ టెస్ట్ ( Pink ball test) మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా… ఈ మ్యాచ్ జరుగుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించగా… రెండవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్. అందుకే ఈ మ్యాచ్ లో పింకు బాలును వినియోగించుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా… మొదట బ్యాటింగ్ తీసుకుంది.
Also Read: ICC Champions Trophy 2025: తిక్క కుదిర్చిన ఐసీసీ…ఇక ఛాంపియన్స్ ట్రోఫీ అక్కడే ?
బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా… 180 పరుగులకు అలౌట్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. అయితే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య పింకు బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో… అందరు పింక్ బాల్ గురించి సెర్చ్ చేస్తున్నారు. పింక్ బాల్ కు అటు రెడ్ బాల్ కు ( Pink Ball vs Red Ball ) ఎలాంటి తేడాలు ఉంటాయి…అనే వివరాలను అన్వేషిస్తున్నారు. వాస్తవంగా టెస్టుల్లో రెడ్ బాల్ మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ డే అండ్ నైట్ జరిగే మ్యాచ్లో మాత్రం పింక్ బాలు నిర్వహించడం జరుగుతుంది.
ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య డే అండ్ నైట్ జరుగుతోంది కాబట్టి పింక్ బాల్ వినియోగిస్తున్నారు. రెడ్ బంతి కంటే పింక్ బంతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చీకటి పడిన సరే బ్యాటర్లకు స్పష్టంగా బంతి కనబడేలా ఈ పింక్ బంతిని తయారు చేస్తారు. అలాగే బంతి త్వరగా చెడిపోకుండా కూడా దీన్ని… తయారు చేయడం జరుగుతుంది. రెడ్ బంతితో పోలిస్తే పింక్ బంతిలో ఎక్కువ లేయర్స్ ఉంటాయని చెబుతున్నారు.
Also Read: IND vs Aus 2nd Test: 180 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..ఆదుకున్న తెలుగోడు !
పింక్ బంతి సీమ్ తెల్లటి దానంతో తయారైతే… రెడ్ బంతి మాత్రం నల్లటి దారంతో తయారవుతుంది. అయితే రెడ్ బాల్ కొన్ని ఓవర్ల వరకు మాత్రమే స్వింగ్ కావడం జరుగుతుంది. బంతి కొత్తగా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. కానీ పింక్ బంతి 40 ఓవర్ల వరకు స్వింగ్ కావడం జరుగుతూనే ఉంటుంది. రాత్రి సమయంలో బౌలర్లకు చాలా అడ్వాంటేజ్ కూడా జరుగుతుంది. అయితే పింక్ బంతి కేవలం పేస్ బౌలర్లకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించదు. అందుకే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో స్పిన్నర్లు నాథన్, రవిచంద్రన్ అశ్విన్ పెద్దగా రాణించలేకపోతున్నారు. ఇక ఈ పింక్ బంతి ధర వచ్చేసి.. రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఉంటుంది. అయితే.. రెడ్ బాల్ తో క్రికెట్ ఆడటం కంటే.. పింక్ బాల్ తో ఆడటం కష్టం అని చెబుతున్నారు. గాయాలు ఎక్కువగా పింక్ బంతితోనే అవుతాయట.