Tandel: కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు చందూ మొండేటి. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి హిట్ సినిమా తరువాత చందూ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో చై సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టొరీ భారి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారి అంచనాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం డి. మత్యలేశం గ్రామంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం శివాలయంలో శరవేగంగా జరుగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ కోసం చిత్ర బృందం మునుపెన్నడూ చూడని అద్బుతమైన సెట్ ను రెడీ చేసింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మూజిక్ అందించిన ఈ అద్బుతమైన పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా ఈ సెట్ నుంచి ఒక రెండు పోస్టర్స్ ను మేకర్స్.. అభిమానుల కోసం షేర్ చేశారు. ఈ పోస్టర్స్ లో నాగచైతన్య, సాయిపల్లవి శివపార్వతులుగా కనిపించారు. వెనుక అర్దనారీశ్వరుల విగ్రహం ఈ పోస్టర్ కు మరింత అందాన్ని తీసుకొస్తుంది. ఈ సాంగ్ కోసం వేలాదిమంది డ్యాన్సర్లు పాల్గొన్నారని తెలుస్తోంది.
ఇక ఈ శివరాత్రి పాట ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ లతో నాగ చైతన్య కెరీర్‌లో మోస్ట్ స్పెషల్ సాంగ్స్ లో ఒకటిగా వుండబోతోందని సమాచారం. ఇక చై, సాయిపల్లవి జంటను చూస్తుంటే.. పైనున్న శివపార్వతులే కిందకు దిగి వచ్చినట్టుందే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.