Yem Maaya Chesave Re Release: ఇటీవల కాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ (Re Release) ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను వారి పుట్టినరోజు సందర్భంగా లేదా సినిమాలు విడుదలై దశాబ్దం లేదా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ చిత్రాలను తిరిగి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టాయి. అయితే త్వరలోనే నాగచైతన్య(Naga Chaitanya) సమంత (Samantha) నటించిన సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చిత్రం ఏం మాయ చేసావే కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
మాయ చేసిన సమంత..
డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నటించిన మొట్టమొదటి చిత్రం ఏం మాయ చేసావే (Yem Maaya Chesave). నాగచైతన్య సమంత జంటగా నటించిన ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా, సమంత కూడా తన నటనతో ప్రేక్షకులను మాయ చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య సమంత జోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
విడాకుల తర్వాత..
ఇక సమంత నాగచైతన్య ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడటం, ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఏం మాయ చేసావే సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో వీరి అభిమానులు ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయారు. ఈ సినిమాని తిరిగి మేకర్స్ జూలై 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అధికారకంగా వెల్లడించారు.
జెస్సీ కార్తీక్ ల ప్రేమాయణం…
మరోసారి సమంత నాగచైతన్య వెండితెరపై ప్రేక్షకులను మాయ చేయడానికి సిద్ధమయ్యారని తెలియగానే అభిమానులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో సమంత జెస్సీ పాత్రలో నటించగా, చైతన్య కార్తీక్ పాత్రలో నటించారు. ఇందులో కార్తీక్ అనే యువ దర్శకుడికి తనకంటే వయసులో రెండేళ్లు పెద్దదైన జెస్సి అనే అమ్మాయి మధ్య నడిచిన ప్రేమాయణం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ ఎంతో అద్భుతంగా చూపించారు. సినిమాలు అంటేనే ఇష్టం లేని కుటుంబంలో పుట్టిన జెస్సీని ప్రేమించిన కార్తీక్ వారి కుటుంబాల నుంచి ఎదురైన ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎలా తమ ప్రేమను సక్సెస్ చేసుకున్నారనే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
#YeMaayaChesave – Re-Release – 18th July pic.twitter.com/4ssCvpa1Ai
— Aakashavaani (@TheAakashavaani) June 14, 2025